/rtv/media/media_files/2025/01/14/z8XYDEr46kH7gaInZ3Iy.jpg)
Khammam tribal school Warden sexually assaults students
Rape case: తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని వార్డెన్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. రేలకాయలపల్లి వసతిగృహంలో వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు రోజుకొక విద్యార్థిని తన రూంలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి రూంకు రాకుంటే సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ టీసీ ఇప్పిస్తానని బెదిరిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు.
విషయం బయటకి చెబితే టీసీ ఇస్తా..
వార్డెన్ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం బయటకి చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానంటూ భయపెడుతున్నాడు. వార్డెన్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కారేపల్లి పోలీసులు వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ , ఐటీడీఏ అధికారి జహీరుద్దీన్ ను ఈ కేసులో చేర్చారు. బాధిత విద్యార్థులను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఇది కూడా చదవండి: charmi : ఛార్మిని అలా చూపించి తప్పు చేశా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!