Electronic Devices Ban on Planes: ఈ 4 గాడ్జెట్‌లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భద్రతా నియమాలను పాటించడం మరింత ముఖ్యంగా మారింది. 27000 mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను విమానంలో తీసుకెళ్లకూడదు. ఇ-సిగరెట్లు, వేప్ పరికరాల వినియోగం కూడా కొన్ని విమానాల్లో నిషేదం. వీటిలో స్మార్ట్ బ్యాగులు ఉన్నాయి.

New Update
Electronic Devices Ban on Planes

Electronic Devices Ban on Planes

విమాన ప్రయాణ సమయంలో భద్రతా నియమాలను పాటించడం ఇప్పుడు మరింత ముఖ్యంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అందరూ దీనిపైనే ఫోకస్ పెట్టారు. విమానానికి ప్రమాదకరంగా మారే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడం చాలా డేంజర్ అని తెలుస్తోంది. విమానంలో తీసుకెళ్లడానికి విరుద్ధంగా పరిగణించబడే 4 గాడ్జెట్‌ల గురించి తెలుసుకుందాం. 

27000 mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు

ప్రస్తుతం మొబైల్ వినియోగం పెరిగిన తర్వాత పవర్ బ్యాంక్ అందరికీ అవసరంగా మారింది. కానీ విమాన ప్రయాణంలో దానికి పరిమితి ఉంది. పవర్ బ్యాంక్ 27000 mAh కంటే ఎక్కువ ఉంటే దానిని తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం. దీని కారణంగా విమానంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అందువల్ల కేవలం 10000 mAh నుంచి 20000 mAh వరకు పవర్ బ్యాంక్‌లు అనుమతిస్తారు. 

Electronic Devices Ban on Planes (1)

ఇ-సిగరెట్లు, వేప్ పరికరాలు

ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలు రెండూ విమానంలో తీసుకెళ్లడం, ఉపయోగించడం ప్రమాదకరం. వాటిలో ద్రవ నికోటిన్, లిథియం బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఉష్ణోగ్రత పెరిగితే ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. అది మంటలకు కారణమవుతాయి. అయితే కొన్ని విమానయాన సంస్థలు వాటిని క్యాబిన్ బ్యాగుల్లో తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. కానీ విమాన ప్రయాణంలో వాటి వాడకం పూర్తిగా నిషేధం. 

WhatsApp Image 2025-06-13 at 12.47.38 PM

స్మార్ట్ బ్యాగులు

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఛార్జింగ్ పోర్ట్, GPS వంటి స్మార్ట్ ఫీచర్లు కలిగిన బ్యాగులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలోని లిథియం బ్యాటరీని రిమూవ్ చేయకపోతే చెక్-ఇన్ లగేజీ వంటి బ్యాగులను తీసుకెళ్లడం నిషేధిస్తారు. ఎందుకంటే బ్యాగ్‌ను కింద ఉన్న కార్గోలో ఉంచినపుడు.. బ్యాటరీలో ఏదైనా సమస్య ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాటరీని తీసివేసే అవకాశం ఉంటే దాన్ని బయటకు తీసి క్యాబిన్‌లో తీసుకెళ్లవచ్చు. 

WhatsApp Image 2025-06-13 at 12.47.38 PM

బ్యాటరీ-ఆధారిత గాడ్జెట్‌లు

కెమెరాలు, డ్రోన్లు లేదా హ్యాండ్ హీటర్లు వంటి అధిక శక్తి గల బ్యాటరీలు కలిగిన గాడ్జెట్‌లను తీసుకెళ్ళకూడదు. వాటిని చెక్ చేయకుండా తీసుకెళ్లడం వల్ల విమానాశ్రయ భద్రతలో సమస్యలు తలెత్తుతాయి. ఈ పరికరాలు అనుకోకుండా యాక్టివేట్ అయ్యి.. విమానం సాంకేతిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు