ముంబయ్ 26/11 ఉగ్రవాదులు జరిపిన మారణకాండ తలుచుకుంటే గుండెల్లో ఇప్పటికీ దడ పుడుతుంది. వాటికి కారణమైన కీలక నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ జైల్లో ఉన్నాడు. తాజాగా అతని పిటిషన్‌ను కొట్టేయాలని అమెరికా సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాణా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న రాణా..
తహవూర్ రాణా పాకిస్తాన్‌కు చెందిన కెనడా సిటిజెన్. ముంబయ్ మారణహోమంలో ఇతనే కీలక నిందితుడు. అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న ఇతడిని తమకు అప్పించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. దీనికి అతను భారత్‌కు అప్పగించకూడని కోరుతూ వివిధ ఫెడరల్ కోర్టులను ఆశ్రయించినా అతడికి నిరాశే మిగిలింది. చివరి ప్రయత్నంగా గతంలో అమెరికా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇక్కడా ఓడిపోతే తహవూర్‌ను భారత్‌కు అప్పగించాల్సిందే. ఇప్పుడు అమెరికా ప్రభుత్వమే రాణా పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది కాబట్టి అతను ఓడిపోక తప్పదని తెలుస్తోంది. దీంతో రాణాను భారత్‌కు అమెరికా త్వరలోనే అప్పగించనుందని చెబుతున్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులు నవంబర్ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే ఏకే-47 తొపాకులతో కాల్చడం మొదలెట్టారు. కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. దీనిలో 58 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాదులు అక్కడ ఒకచోటితోనే ఆగిపోలేదు. తరువాత 12 చోట్ల కాల్పులు, బాంబులతో మోత మోగించారు. 60 గంటలపాటూ మారణహోమం కొనసాగించారు. ఇందులో మొత్తంగా 166 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు.
Also Read: ఈ వీకెండ్ లో నా అరెస్ట్.. బెయిల్ కూడా వద్దు..ఏసీబీ కేసుపై కేటీఆర్ స్పందన