భార్యను 72 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు.. ఫుడ్‌లో మత్తుమందు కలిపి

భార్యకు మత్తుమందు ఇచ్చి ఓ దుర్మార్గుడు 72 మందితో లైంగిక దాడి చేయించిన ఘటన ఫ్రాన్స్‌లో సంచలనం రేపింది. 26 నుంచి 73 ఏళ్ల వయస్కులతో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు నిందితుడు డొమినిక్ అంగీకరించాడు. అతనికి ఫ్రాన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించనుంది. 

author-image
By srinivas
New Update
t e

te rt Photograph: (eetr)

Sexual assault: ఓ మహిళలకు తన మాజీ భర్త మత్తుమంది ఇచ్చి 72 మందితో లైంగిక దాడి చేయించిన కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితుడు డొమినిక్‌ పెలికాట్‌ (71)ను దోషిగా తేలుస్తూ ఫ్రాన్స్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఆ దుర్మార్గుడికి ఏ శిక్ష వేయబోతున్న విషయాన్ని న్యాయస్థానం ప్రకటించలేదు. కానీ సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన నీచుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేయాలని బాధితురాలి తరఫు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

దాదాపు పదేళ్లపాటు దాడి.. 

ఫ్రాన్స్ ప్రభుత్వ ఉద్యోగి డొమినిక్‌ పెలికాట్‌ తన భార్యను చాలా రోజులుగా టార్చర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాత్రులు ఆమె తినే భోజనంలో మత్తు మందు కలిపేవాడు. అది తిన్నవెంటనే ఆమె మత్తులోకి జారుకోవడంతో పలువురు పురుషులను పిలిపించి  లైంగిక దాడి చేయించాడు. వారంతా అత్యాచారం చేస్తుంటే సీక్రెట్ కెమెరాల్లో బంధించేవాడు. ఇలా దాదాపు పదేళ్లపాటు 2011 నుంచి 2020 దాకా చేశాడని బాధితురాలు పోలీసుల ముందు కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు షాపింగ్‌ సెంటర్‌లో డొమినిక్‌ కొందరు మహిళలను సీక్రెట్ గా వీడియో తీస్తుండగా సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో అతని ఫోన్‌, కంప్యూటర్‌ పరిశీలించగా దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. భార్యపై లైంగిక దాడులకు సంబంధించి వందలకొద్ది ఫొటో, వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: రేవంత్‌కు రోజూ పత్తాలు ఆడే అలవాటు.. కేటీఆర్ షాకింగ్ ఆరోపణలు!

ఇక డొమినిక్ ను అరెస్ట్ చేసి విచారించగా.. 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయస్కులైన మొత్తం 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 51 మందిని గుర్తించి అదుపులోకి తీసుకోగా మిగతావారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇక కోర్టులోనూ తాను రేపిస్ట్‌నని డొమినిక్ అంగీకరించడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు