Black Magic: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలను గ్రామస్థులు దారుణంగా కొట్టి హింసించారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఆఖరికీ కుక్క మలాన్ని కూడా తినిపించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Balck Magic

Black Magic

మహారాష్ట్ర (Maharashtra) లోని అమరావతి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి (Black Magic) చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలను గ్రామస్థులు దారుణంగా కొట్టి హింసించారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఆఖరికీ కుక్క మలాన్ని కూడా తినిపించారు. ఆ తర్వాత మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. దీంతో వృద్ధురాలి కొడుకు, కోడలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read :  Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు

BLACK MAGIC IN AMARAVATI

ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రెత్యాఖేడ అనే గ్రామంలో 77 ఏళ్ల వృద్ధురాలు జీవిస్తోంది. అయితే డిసెంబర్ 30న ఆమె కొడుకు, కోడలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఆ వృద్ధురాలు ఒంటరిగా ఉంది. దీంతో ఆమె చేతబడి చేస్తున్నట్లు అనుమానించిన స్థానికులు కర్రలతో కొట్టారు. కాళ్లపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించి, కుక్క మలాన్ని తినిపించారు. మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ దారుణం గురించి జనవరి 5న వృద్ధురాలి కొడుకు, కోడలుకు తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.   

Also Read :  డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?

చివరికి పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఆ గ్రామానికి పోలీసులను పంపిస్తున్నట్లు అమరావత జిల్లా ఎస్పీ విశాల్ ఆనంద్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ స్థానిక పోలీసులు ఈ కేసును దాచిపెట్టాలని చూసినట్లు తేలితే వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

Also Read :  కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు