వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి

ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి(7) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Stray Dogs

Stray Dogs

ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి దాడుల్లో ఇటీవల పలువురు చిన్నారులు కూడా మృతి చెందిన ఘటనలు జరిగాయి. అయితే తాజాగా రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్వార్‌ జిల్లాలోని ఇక్రానా (7) అనే చిన్నారి తన తాతా, ఐదుగురు స్నేహితులతో కిలిసి పొలానికి వెళ్లింది. 

Also Read: ప్రేమికురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యూపీ వాసి.. చివరికీ ఊహించని షాక్

పొలంలో పని అయిపోయిన తర్వాత ఆ తాత దగ్గర్లో ఉండే ఓ మార్కెట్‌కు వెళ్లాడు. తన మనువరాలు ఇక్రాన్‌కు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లాడు. అయితే తాతా మాటలు విన్న ఇక్రాన్ తన స్నేహితులతో కలిసి కాసేపు పొలంలోనే ఆడుకుంది. ఆ తర్వాత సాయంత్రం వాళ్లందరూ ఇంటికి బయలుదేరారు.  అయితే మార్గ మధ్యంలో 7 -8 వీధి కుక్కలు ఇక్రానా, ఆమె స్నేహితులపై దాడులు చేశాయి. దీంతో ఈ చిన్నారులు బిగ్గరగా కేకలు వేశారు. వాళ్ల అరుపులు వినిపించడంతో పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు వెంటనే అక్కడికి వచ్చారు. పిల్లల్ని కుక్కల నుంచి రక్షించారు. అత్యవసర చికిత్స కోసం ట్రాక్టర్‌లో తరలించారు.  

Also Read: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం

కానీ ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలిపెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్‌లో తరలిస్తున్నా కూడా కరిచేందుకు యత్నించింది. చివరికీ కుక్కల దాడిలో గాయాలపాలైన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇక్రానా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక్రానాపై దాడి చేసిన ఈ కుక్క గతంలో కూడా ఇతర జంతువులపై దాడి చేసిందని.. అందుకే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. 

Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు