/rtv/media/media_files/2025/10/01/6-children-die-of-kidney-failure-in-15-days-in-madhya-pradesh-2025-10-01-15-05-46.jpg)
6 Children Die Of Kidney Failure In 15 Days In Madhya Pradesh
మధ్యప్రదేశ్(madya pradesh) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందడం కలకలం రేపింది. కాఫ్ సిరఫ్(Syrup) తాగడం వల్లే ఈ విషాదం జరగడం తీవ్ర దుమారం రేపింది. దీంతో అక్కడి ప్రభుత్వం రెండు రకాల కాఫ్ సిరప్‌లపై నిషేధం విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మృతి చెందారు. ముందుగా వాళ్లు ఆస్పత్రికి వచ్చినప్పుడు వైద్యులు సీజనల్ జ్వరాలు అనుకుని ట్రీట్‌మెంట్ చేశారు. కానీ డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం వల్ల ఆ చిన్నారులు తాగిన దగ్గు సిరప్ కలుషితమైనట్లు గుర్తించారు. అందువల్లే వారు మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక.. భారీగా DA పెంపు!
6 Children Die Of Kidney Failure
చింద్వారా జిల్లాలో ఇటీవల 5 ఏళ్ల లోపు ఉన్న ఆరుగురు పిల్లలు మొదట జలుబు(cough), తేలికపాటి జ్వరంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లారు. వాళ్లు దగ్గు సిరప్‌తో పాటు ఇతర మందులు ఇచ్చారు. వాటిని వాడాకా పిల్లలు మొదటగా కోలుకున్నట్లు అనిపించినా.. కొద్ది రోజులకే పరిస్థితులు తలకిందులయ్యాయి. వాళ్లకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ముత్రం కూడా ఆగిపోయిందియ చివరికి అది వాళ్లకి కిడ్నీల ఇన్‌ఫెక్షన్‌గా మారింది. మెరుగైన చికిత్స కోసం ఆ చిన్నారులను మహారాష్ట్రలోని నాగపూర్‌కు తరలించి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!
అయితే మృతుల కిడ్నీ బయాప్సీలలో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే చింద్వారా జిల్లా కలెక్టర్ షీలేంద్ర సింగ్ కోల్డ్‌రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ అనే రెండు రకాల దగ్గు మందులపై జిల్లా వ్యాప్తంగా నిషేధం విధించారు. అలాగే వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. అంతేకాదు ఈ ప్రమాదంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుంచి టీమ్‌ను పిలిపించి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాకిస్థాన్.. భయంతో వణికిపోతున్న ప్రజలు