/rtv/media/media_files/2025/05/22/VOIHnfkQ38IaghodOp38.jpg)
Canada in talks to join US Golden Dome missile defence system, Says Mark Carney
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అమెరికా గగనతంలలోకి ఎలాంటి క్షిపణీ, అణ్వాయుధాలు ప్రవేశించకుండా అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది ట్రంప్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు నిర్మాణంలో కెనడా కూడా భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతోందని ట్రంప్ ఇటీవలే చెప్పారు. తాజాగా దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
Also Read: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు
'' అమెరికా నిర్మిస్తోన్న గోల్డెన్ డోమ్‌లో భాగం కావడానికి వాళ్లతో చర్చలు జరుపుతున్నాం. కెనడా పౌరుల రక్షణ కోసం ఇది మంచి ఆలోచనగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కెనడా లక్ష్యంగా అంతరిక్షం నుంచి వచ్చే మిసైల్స్ ముప్పును కూడా ఇది ఎదుర్కొంటుంది. మేమే సొంతంగా ఈ గోల్డెన్ డోమ్‌ను నిర్మించుకోవాలా ? లేదా అమెరికాతో భాగం కావాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నామని'' మార్క్ కార్నీ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు ఉన్న ఐరన్ డోమ్ మాదిరిగానే అమెరికా గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏవైపు నుంచి క్షిపణులు, అణ్వాయుధాలు వచ్చిన ఇది రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు అంతరిక్షం నుంచి దాడులు చేసిన కూడా వాటిని అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. అయితే యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ చెప్పారు. తన పదవీకాలం ముగిసేలోపు ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు.
Also Read: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు
ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని ట్రంప్ చెప్పినప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని చైనా, రష్యా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ రక్షణ వ్యవస్థ తీవ్రంగా అస్థిరతను సృష్టిస్తుందని.. అమెరికా అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆరోపిస్తున్నాయి.
telugu-news | rtv-news | usa | space | trump