/rtv/media/media_files/2025/05/22/Kfq7fExUuhTOlJBoZGA7.jpg)
Street vendors
Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులు అధిక వడ్డీ రుణాల నుంచి విముక్తి పొందడానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రుణాల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను(Pradhan Mantri Atmanirbhar Nidhi) తీసుకొచ్చింది. వీధి వ్యాపారాలకు మూడు విడతల్లో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేది. అయితే గతేడాది ఈ రుణాల ప్రక్రియను క్లోజ్ చేసేసింది. దీంతో వీధి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
కేవలం పట్టణాల్లో ఉండే వీధి వ్యాపారులకు మాత్రమే..
ఈ క్రమంలో వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఆత్మనిర్భర్ నిధి కింద క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిని కేవలం పట్టణాల్లో మాత్రమే అమలు చేశారు. వీధి వ్యాపారులకు మొదటి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున రుణాలు ఇచ్చారు.
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
క్రెడిట్ కార్డు లిమిట్ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు
ఇప్పుడు దీన్ని నిలిపివేయడంతో క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. క్రెడిట్ కార్డు లిమిట్ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఇవ్వనున్నారు.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
క్రెడిట్ కార్డు ఉంటే వీధి వ్యాపారులు ఎప్పుడు వారికి అవసరం ఉంటే అప్పుడే ఉపయోగించుకోవచ్చు. వాటితో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి నెల రోజుల్లోగా మళ్లీ ఆ డబ్బులు చెల్లించాలి. మళ్లీ కావాలంటే దాన్ని డబ్బులు తీసుకోవచ్చు.