/rtv/media/media_files/2025/07/05/trivikram-venkatesh-latest-update-2025-07-05-14-59-05.jpg)
Trivikram - Venkatesh latest update
'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ తదుపరి రెండు ప్రాజెక్టులు ఖరారయ్యాయి. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్ తో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా వెంకీ- త్రివిక్రమ్ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాకు 'వెంకట రమణ' టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి "కేర్ ఆఫ్ ఆనంద నిలయం" అనే ట్యాగ్‌లైన్ కూడా ఆలోచించారని అంటున్నారు. త్రివిక్రమ్ - వెంకీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉండబోతుందని తెలుస్తోంది.
Also Read:Naga Chaitanya NC24: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!
వెంకటేష్ 77వ చిత్రం
వెంకటేష్ 77వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా వెంకీ మామ కెరీర్ లోనే స్పెషల్ గా ఉండబోతుందని టాక్. అంతేకాదు త్రివిక్రమ్- వెంకీ కాంబోలో రాబోతున్న మొదటి సినిమా ఇది. గతంలో త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన "నువ్వు నాకు నచ్చావ్", "మల్లీశ్వరి" సినిమాలకు రచయితగా పనిచేశారు. ఇప్పుడు మొదటిసారి వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2026 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read:Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!
Also Read : వల్లభనేని వంశీని కలిసిన కొడాలి నాని!
cinema-news | Latest News | Venkatesh - Trivikram