Pune Crime: యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో ట్విస్ట్ ...అంతా ఉత్తదే..

పుణే లైంగికదాడి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఐటీ ప్రొఫెషనల్‌ పై డెలివరీ భాయ్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. అదంతా ఉత్తదే అని తేలింది. అతను ఆమె భాయ్ ఫ్రెండెనని పోలీసులు తేల్చారు. స్నేహితుడి పై నిందలు వేసినట్లు తెలిసింది.

New Update
Pune fake courier raped

Pune fake courier raped left with selfie

Pune Crime:పుణే లైంగికదాడి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఐటీ ప్రొఫెషనల్‌ (22)పై డెలివరీ భాయ్ లైంగిక దాడి చేసినట్లు నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. అదంతా ఉత్తదే అని తేలింది. అతను ఆమె భాయ్ ఫ్రెండెనని పోలీసులు తేల్చారు. పుణే పోలీసు కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, కొంధ్వాలోని ఫ్లాట్‌లో నివసిస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదులో, కొరియర్‌ ఏజెంట్‌నని చెప్పుకున్న గుర్తు తెలియని వ్యక్తి తనపై రసాయనాలు జల్లి, అఘాయిత్యం చేశాడని ఆరోపించారు.  అయితే, ఆమె చెప్పిన నిందితుడు  డెలివరీ ఏజెంట్‌ కాదు.. వ్యక్తిగత వివాదం కారణంగానే స్నేహితుడినే ఇంటికి పిలిపించి అతడి పై నిందలు వేసినట్లు తెలిసింది. ఆమెను విచారించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

Also Read: ఎవర్రా మీరంతా.. అప్పుడేమే 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడు పాములా మెలికలు తిరిగేలా

వీరిరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, సుమారు రెండేళ్ల నుంచి ఇరువురికి పరిచయం ఉంది. ఆమె సాక్ష్యంగా చూపిన సెల్ఫీ కూడా ఆమె తన ఫోన్‌ను ఉపయోగించి తీసుకున్నదే. దీనిలో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఆమె ఆ ఫొటోను ఎడిట్‌ చేసింది. అతను ఆమెపై ఎటువంటి రసాయనాలను జల్లలేదు. బెదిరింపు మెసేజ్‌ను కూడా ఆమె స్వయంగా టైప్‌ చేసుకుంది. ఆమె మానసిక స్థితి ప్రస్తుతం సక్రమంగా లేదు. రేప్‌ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.10 టీమ్స్‌తో నిందితుడి కోసం గాలించగా అసలు విషయం బయటపడిందని వెల్లడించారు.

Also Read:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

మహిళను అత్యాచారం చేసింది తన ఫ్రెండేనని.. వారిద్దరికీ ఎప్పటినుంచో పరిచయం ఉందని.. గతంలో ఎన్నో సార్లు కలుసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆ రోజు నేను లైంగిక సంబంధానికి సిద్ధంగా లేనని.. కానీ నా ఫ్రెండ్ నన్ను బలవంతం చేశాడని, అందుకే అతడిపై కోపంతోనే డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో యువతి తెలిపింది.అంతేకాకుండా ఆ మహిళే సెల్ఫీ తీసుకుని.. నిందితుడి మాదిరి మళ్లీ వస్తానంటూ వార్నింగ్ కోట్ రాసిందని విచారణలో పోలీసులు తేల్చారు.

Also Read: పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య..కారు దిగుతుండగానే కాల్పులు..

Advertisment
తాజా కథనాలు