Driving License: రవాణా శాఖ సంచలనం...18,973 డ్రైవింగ్‌ లైసెన్సుల సస్పెన్షన్‌

రోడ్డు రవాణా నిబంధనలను  ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమవ్వడం, ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది.

New Update
Driving Licence - Telangana Transport

Driving Licence - Telangana Transport

Driving License: 

రోడ్డు రవాణా నిబంధనలను  ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమవ్వడం, ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్‌ మధ్యలో మద్యం సేవించి వాహనాలు నడపడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం, అతివేగంతో డ్రైవింగ్‌(Speeding) చేయడం, రోడ్డు రవాణా నిబంధనలు ఉల్లఘించడం వంటి కారణాలతో లెసెన్స్‌లు రద్దు(Licenses Cancelled) చేసినట్లు రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రగతి నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. వివరాలివి..

Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) పాలసీతో పరిమితి లేకుండా 2024 నవంబరు 16 నుంచి 2025 జూన్‌ 30 వరకు 49,633 ఈవీలకు రూ.369.27 కోట్ల మినహాయింపు ఇచ్చినట్లు రవాణా శాఖ తెలిపింది. వీటికి100 శాతం రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. లైసెన్స్‌లు జారీ చేసేందుకు డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు 25 ద్విచక్ర వాహనాల ట్రాక్‌లు.. 27 ఫోర్‌వీలర్, 5 భారీ వాహనాల ట్రాక్‌లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లుగా మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Also Read: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

ఇక ‘వాహన్‌’ అప్లికేషన్‌(Vahan Application)ను ఇతర రాష్ట్రాల మాదిరిగా అమలు చేయడంతో పాటు ఆగస్టు చివరినాటికి ఈ డిజిటల్‌ సేవల ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. వాహన ఉద్గారాలను పర్యవేక్షించడానికి  కాలుష్య టెస్టింగ్‌ సెంటర్లను కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం చేయడానికి నిర్ణయించినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే  తెలంగాణ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ‘టీఎస్‌’ను 2024 మార్చి 15 నుంచి ‘టీజీ’గా మార్పు చేయడం జరిగిందని తెలిపింది. తద్వారా ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్‌తో మార్పు చేసినట్లు వెల్లడించింది.

Also Read: ఉక్రెయిన్‌పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు