Maoists Killed: మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్జిరోలిలో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఓ ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
3 Naxals Killed, Commando Dead In Encounter In Maharashtra's Gadchiroli

3 Naxals Killed, Commando Dead In Encounter In Maharashtra's Gadchiroli

మహారాష్ట్రలోని గడ్జిరోలిలో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భ్రమగఢ్‌ తాలుకాలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.  

Also Read: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. 1500కి పైగా కాకులు మృతి

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఓ ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ దీపక్ మాధవి సైతం ప్రాణాలు కోల్పోయారు. సీ60 కమాండో జోగా దీపక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హెలికాప్టర్‌లో గడ్చిరోలిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.  

Also Read: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్

Advertisment
తాజా కథనాలు