Tahawwur Rana: NIA అదుపులో తహవ్వుర్ రాణా.. ఫొటో విడుదల

ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్‌ రాణాను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు.. పటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ముందు జాగ్రత్తగా కోర్టు ప్రాంగాణాన్ని పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు.

New Update
26/11 Mumbai attacks mastermind Tahawwur Rana successfully extradited, Says NIA

26/11 Mumbai attacks mastermind Tahawwur Rana successfully extradited, Says NIA


ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్‌ హుస్సేన్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చి సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే రాణాను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు.. పటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

ముందు జాగ్రత్తగా కోర్టు ప్రాంగాణాన్ని పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు. అలాగే మీడియాను కూడా బయటకు పంపించేశారు. రాణాను తీహార్‌ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. రాణాను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటించింది. అతడిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామని పేర్కొంది. ఎన్‌ఐతో పాటు ఎన్‌ఎస్‌జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్‌ డీఓజే, అమెరికాలోని సంబంధిత అధికారుల వల్ల ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యిందని తెలిపింది.  

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

ఇదిలాఉండగా ఈ కేసు NIA తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్‌, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ హాజరయ్యారు. ఇప్పటికే వీళ్లిద్దరూ కూడా కోర్టు ప్రాంగణానికి వచ్చారు. ఈ కేసు గురించి వాళ్లు మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక నిందితుడు తహవ్వుర్ రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పీయూష్ సచ్‌దేవ హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు రాణా ఎన్‌ఐఏ అధికారుల అదుపులోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్ అవుతోంది. 

Also Read: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్‌కు రూ.4 కోట్లు

Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు