/rtv/media/media_files/2025/05/26/NpS2qCrNXZp5gAhahooL.jpg)
Vizianagaram Terror Case
Vizianagaram Terror Case : విజయనగరం ఉగ్ర కేసులో భాగంగా నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసులు ఐదవ రోజు కూడా విచారిస్తున్నారు. వీరు ఇద్దరూ కోర్టు ఆదేశాల మేరకు వారం రోజులు పోలీసు కస్టడీలో ఉన్నారు. పోలీసులు వారిని విభిన్న కోణాల్లో విచారించి, పలు విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. 5వ రోజు కస్టడీలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం.సిరాజ్, సమీర్‌లు మరో 20 మందితో కూడిన ఒక గ్రూప్‌లో ఉన్నట్టు ధ్రువీకరించారు. వీరే కాకుండా దేశవ్యాప్తంగా మరింత మంది స్లిప్పర్ సెల్స్ ఉన్నట్లు సమాచారం..
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే
అహిం గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉన్నారు.. ఇందులో ఎంతమంది స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్నారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం..ఈ అహీమ్ గ్రూపులో ఉన్న ముఖ్యమైన 20 మంది సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా దేశంలో పేద నిరుద్యోగ యువకులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డబ్బు ఆశ చూపించి స్లిపర్స్ సేల్స్ గా మారుస్తున్నారని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.సౌదీ అరేబియన్ ఉమెన్ దేశాలనుంచి నుండి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ సమీర్ లకు ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిలో ట్రాన్సాక్షన్ ఎక్కడ నుండి జరిగాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిరాజ్, సమీర్‌లను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు, ఉగ్రవాద సంస్థలతో వారికున్న సంబంధాలు, ఆర్థిక వనరులు, హ్యాండ్లర్లలో ప్రధాన సూత్ర, పాత్రదారుల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
ఉగ్రవాద భూతం దేశవ్యాప్తంగా చాప కింద నీరుల అల్లుకుపోయినట్లు రక్షణ వర్గాలు గుర్తించినట్లు సమాచారం అందుతోంది. సౌదీ ఉమెన్ దేశాల లో ఉన్న హ్యాండ్లర్స్ ఆదేశాల కోసం స్లీపర్ సెల్స్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా సిరాజ్, సమీర్ లకు మరో రెండు రోజులు మాత్రమే కస్టడీ మిగిలి ఉండటంతో వారినుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు విచారిస్తున్నారు. ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిజం, తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. కాగా కుట్ర కేసులో విశాఖకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం