/rtv/media/media_files/2025/09/09/vice-2025-09-09-20-20-14.jpg)
అందరూ ఊహించిందే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election 2025)లో NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్(CP Radhakrishnan) విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రాధాకృష్ణన్ విజయం సాధించడం విశేషం. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా, 98% పైగా ఓట్లు పోలైనట్లుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ వెల్లడించారు. 13 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని, 15 మంది వేసిన ఓట్లు చెల్లవని ప్రకటించారు. 15మంది ఎంపీలకు ఓటింగ్ వేయడం కూడా రాకపోవడం నిజంగా దారుణమని నెటిజన్లు సోషల్ మీడియా(Social Media) వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దాదాపుగా నెలకు రెండు లక్షల జీతం తీసుకునే మన దేశ ఎంపీలకు ఓటు ఎలా వేయడం కూడా తెలియకపోవడం, అలాంటివాళ్లు మనకు ప్రజాప్రతినిధలుగా ఉండటం నిజంగా దౌర్భాగ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : బాంబులు విసిరినా బెదరని నైజం.. RSS కార్యకర్త నుంచి ఉప రాష్ట్రపతి వరకు.. రాధాకృష్ణన్ బ్యాగ్రౌండ్ ఇదే!
సీపీ రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే!
రాధాకృష్ణన్ ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఎంపీగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు.
రాధాకృష్ణన్ తమిళనాడు(Tamil Nadu) లోని తిరుప్పూర్లో జన్మించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని చాలా చిన్న వయసులోనే, అంటే 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో స్వయంసేవక్గా ప్రారంభించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు కోయంబత్తూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
గవర్నర్ గా బాధ్యతలు: ఆయన గవర్నర్ గా వివిధ రాష్ట్రాలకు సేవలు అందించారు:
జార్ఖండ్ గవర్నర్ (2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు).
తెలంగాణ గవర్నర్ (2024 మార్చి నుంచి 2024 జూలై వరకు).
మహారాష్ట్ర గవర్నర్ (2024 జూలై నుంచి ప్రస్తుతం )