/rtv/media/media_files/2025/11/03/tuition-2025-11-03-21-11-55.jpg)
14 Year Old Girl Left Home For Tuition, Gang-Raped In Kolkata, 3 Arrested
పశ్చిమ బెంగాల్‌లో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగడం కలకలం రేపుతోంది. ట్యూషన్ కోసం వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని డమ్ డమ్ ప్రాంతానికి చెందిన బాలిక (14) ఏడో తరగతి చదువుతోంది.
Also Read: బాబోయ్ బస్సులు.. 2 నెలల్లో 100 మంది బలి! - మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల
ట్యూషన్‌కు వెళ్లేందుకు శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఓ పార్క్ వద్ద తనకు తెలిసిన వ్యక్తిని ఆ బాలిక కలిసింది. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు కలిసి బలవంతంగా ఆమెను ఆటోలో వేరే ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. చివరికి బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు.
Also Read: డిజిటల్ అరెస్టుతో రూ.3 వేల కోట్లు మాయం.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై పోక్సోతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాళ్లని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు సంజు సాహా, విక్కీ పాస్వాన్, రాజేష్ పాస్వాన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
 Follow Us