మైనంపల్లి హన్మంతరావు ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కు రాజీనామా ఇచ్చేసిన మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళుతున్నారు. సీఎల్పీ బట్టి విక్రమార్కతో మధుయాష్కీ, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదరం రాజనరసింహ తదితరులు మైనంపల్లి ఇంటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చేసిన రోజునే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రకారం ఈ నెల 27న మైనంపల్లి తన కుమారుడు రోహిత్ తో పాటూ మల్లిఖార్జున ఖర్గేతో పాటూ కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు.రాహుల్ గాంధీ, సోనియా అంటే తనకు గౌరవం అని ఆయన తెలిపారు. వాళ్ళ నుంచి నుంచి ఎన్నో ఆదర్శాలను నేర్చుకున్నానని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత హైదరాబాద్ లో సోనియాగాంధీతో సభ ఉంటుందని తెలిపారు. తనకు మల్కాజిగిరి, తన కొడుకు రోహిత్ కు మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటూ మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ విషయం మీద ఇప్పటికే ఈ విషయం మీద మైనంపల్లితో కాంగ్రెస్ నేతలు చాలా సార్లు చర్చించారని తెలుస్తోంది. తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకున్నాకనే పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
రెండురోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి... తన కొడుక్కి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు…తన కొడుక్కి టికెట్ రాకుండా హరీష్ రావు చేస్తున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇదే కోపంలో పార్టీకి ఆయన రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ టికెట్ ఫిక్స్?