ఆ ఎంపీ సీట్ ఎవరికో!.. మల్కాజిగిరి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
మల్కాజిగిరి కాంగ్రెస్లో పరిణామాలు పార్టీ కేడర్ లో అయోమయం నింపుతున్నాయి. లోకసభ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.