Minister Roja: బ్రాహ్మణీకి అసలు సైకోలు ఎవరో తెలియడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. By Karthik 30 Sep 2023 in తిరుపతి రాజకీయాలు New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పలు కంపెనీల ద్వారా చంద్రబాబు సుమారు 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చుంటే ఆయన కోడలు బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా గంటకొట్టి బాబుకు సంఘీభావం తెలపాలని కోరడం ఏంటన్నారు. బహుశా బ్రాహ్మణికి అసలు సైకో ఎవరో తెలియక ట్విట్లు పెడుతున్నట్లు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అసలు సైకోలు చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది బాలకృష్ణ అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీని సినిమా సెట్ అనుకుంటున్నాడని రోజా ఎద్దేవా చేశారు. అందుకే ఆయన తొడలు కొట్టడం, విజుల్స్ వేయడం లాంటి వికృత చేష్టలు చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా.. లోకేష్ చేపట్టిన యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. లోకేష్ టీడీపీ నేతలతో తన యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్ సైతం జైల్లో కూర్చోక తప్పదని మంత్రి రోజా మండిపడ్డారు. తండ్రి చేసిన తప్పుల్లో తనయుడి పాత్ర కూడా ఉందని రోజా అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం ఖాయమని టూరిజం శాఖ మంత్రి జోస్యం చెప్పారు. #arrest #psycholu #chandrababu #balakrishna #tdp-ycp #yuvagalam #brahmani #minister-roja #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి