మహిళలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ? విడుదల రజిని కన్నీరు | Vidadala Rajini Emotional Comments | RTV
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు పోలీసు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురును అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.
కాకినాడ జిల్లా గాడిమొగ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో వెళ్లొదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.