Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ నేత లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ తిరిగి రానున్నారు. దాంతో పాటూ ఎల్లుండి నుంచి యువగళం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తప్పదా..? ఏపీ రాగానే నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా.? లేదా ఆయన యువగళం పాదయాత్ర తిరిగి మొదలు అవుతందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు.
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు.
నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు.