ప్రాణాలు పోతుంటే మీరేం పి**| RK Roja Serious Warning to CM Chandrababu Kadapa Student Incident | RTV
AP: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మంత్రి రోజాపై నగరిలోని ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు ఫైర్ అవుతున్నారు. రోజాకు టికెట్ ఇస్తే వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని అంటున్నారు. రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమన్నారు.
మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంత్రి రోజాకు ఆహ్వానం లేకుండా సచివాలయం ప్రారంభించారు జడ్పీటీసీ మురళీధర్. అయితే, జడ్పీటీసీ శిలాఫలకాన్ని తొలగించి అదే సచివాలయాన్ని తిరిగి ప్రారంభించారు మంత్రి రోజా.
షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు.
వైసీపీ మంత్రి రోజాకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు.
టీడీపీ- జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని అన్నారు మంత్రి రోజా. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు వచ్చి భోగి వేస్తున్నారు.. భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతారని అన్నారు.
ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ చెప్పారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. రోజాపై బండారు గతనెలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు రోజా.