Minister Roja: పక్క రాష్ట్రాల్లో కాపురాలు..ప్రగల్భాలు ఇక్కడ..షర్మిల పై విరుచుకుపడ్డ రోజా!

షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు.

New Update
Minister Roja: పక్క రాష్ట్రాల్లో కాపురాలు..ప్రగల్భాలు ఇక్కడ..షర్మిల పై విరుచుకుపడ్డ రోజా!

AP Politics: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకి హీట్‌ పెరిగిపోతుంది. ఇప్పటికే అక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ(YCP), జనసేన, టీడీపీ (TDP) లు తన్నుకు చస్తుంటే..ఇప్పుడు తాజాగా ఏపీపీసీసీ(APPCC)  అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కూడా ఏపీ రాజకీయాల్లో కాలు పెట్టడంతో మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మరునాటి నుంచే షర్మిల తన అన్న జగన్‌ కే మేకై కూర్చున్నట్లు ఆయన మీదకే మాటల తూటాలు వదులుతున్నారు.

ఈ క్రమంలోనే వైఎస్‌ షర్మిలను టార్గెట్‌ చేస్తూ వైసీపీ మంత్రి రోజా (Minister Roja) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాన్‌ లోకల్‌ నేతలు అంతా కూడా జగన్‌ గురించే మాట్లాడుతున్నారు. సంక్రాంతికి అల్లుళ్లు వచ్చినట్లు రాష్ట్రానికి వస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రోజా షర్మిల పై విరుచుకుపడ్డారు.

షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణ (Telangana) లో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.

వేషం కాంగ్రెస్‌, స్క్రిప్ట్‌ చంద్రబాబుది..

షర్మిల వేషం కాంగ్రెస్‌, స్క్రిప్ట్‌ చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. షర్మిల మాటలకు విలువ లేదని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ , జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు. ఇక నేను పోటీ చేసే దాని గురించి ఇప్పుడు చాలా మంది చర్చిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రాజకీయాల్లో 10 సంవత్సరాలలో ఎవరి దగ్గర నుంచి నేను రూపాయి కూడా తీసుకోలేదు..ఆశించలేదని ఆమె పేర్కొన్నారు.

ఒంగోలులో పోటీ చేయాల్సిన అవసరం లేదు..

ఒంగోలు నుంచి పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను నగరిలో ఉండగా నాకు ఒంగోలులో పోటీ చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. నిన్న విశాఖ భీమిలీలో జరిగిన సభను మించిన సభ రాయలసీమలో జరుగుతుందని రోజా వెల్లడించారు. ఆదిమూలం మాట్లాడిన మాటలు నాతో పాటు పార్టీలోని నేతలను కూడా బాధ పెట్టినట్లు ఆమె చెప్పారు. పెద్దిరెడ్డి పై కక్ష సాధించడానికే తప్ప ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

పార్టీ నేతలంతా కూడా పార్టీలో జరుగుతున్న మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని అన్నారు. సీట్లు కోల్పోయిన వారికి అందరికీ న్యాయం జరుగుతుందని రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే మళ్లీ సీఎం అవుతారని ఆమె అన్నారు. జగన్‌ ను ముఖ్యమంత్రి చేయడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.

Also read: అమెరికా సరిహద్దు దగ్గర తీవ్రవాద దాడి జరగొచ్చు : మాజీ అధ్యక్షుడు ట్రంప్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు