Donald Trump: ట్రంప్‌ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

Donald Trump: ట్రంప్‌ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత..
New Update

Trump Social Media Accounts: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ' పొలిటికల్ లీడర్ల భావ వ్యక్తీకరణ స్వే్చ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత. అందుకే ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఆలోచనలను, మాటలను అమెరికా ప్రజలు వినాలని భావిస్తున్నాం. అందరు యూజర్ల లాగే అభ్యర్థులు కూడా రూల్స్‌కు కట్టుబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవాలి. హింసను, విద్వేషాన్ని ప్రేరేపించేలా ప్రసంగాలు చేయకూడదని' మెటా సంస్థ తెలిపింది.

Also Read: ట్రంప్ ప్రచారానికి ఎలాన్‌ మస్క్‌ విరాళం.. !

ఇదిలాఉండగా.. 2021లో వైట్‌హౌస్‌పై ట్రంప్ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం ట్రంప్‌నకు చెందిన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను బ్యాన్ చేశారు. ఆ తర్వాత 2023లో మళ్లీ వాటిని పునరుద్ధరించారు. ఒకవేళ ట్రంప్‌ భవిష్యత్తులో మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని మెటా తెలిపింది. గత ఏడాది ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాపై పరిమితులు ఎత్తివేసినా కూడా ట్రంప్ దాన్ని వాడలేదు. దీనికి బదులుగా తన సొంత మీడియా ప్లాట్‌ఫాం అయిన 'ట్రూత్ సోషల్' వేదికగా తన ఆలోచనలను నెటీజన్లతో పంచుకుంటున్నారు.

అయితే ట్రంప్‌ ఫేస్‌బుక్‌కు 34 మిలియన్ల మంది ఫాలోవర్సలు ఉండగా.. యూట్యూబ్‌లో 2.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో లాగే ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఈసారి ఎవరు అధ్యక్ష పిఠాన్ని దక్కించుకుంటారనే దానిపై అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు

#telugu-news #meta #donald-trump #joe-biden #usa-elections #facebook #instagram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe