Guntur Karam Song: గుంటూరు కారంలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. 2024 జనవరి 12న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం సినిమాలోని మాస్ బీట్ 'కుర్చీమడత పెట్టి' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది.

New Update
Guntur Karam Song: గుంటూరు కారంలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!

Guntur Kaaram Song : ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కతుంది. హాసిని, హారిక క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీల మహేష్ బాబు(Mahesh Babu) సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రమ్య కృష్ణ, జయరామ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రం జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన 'దమ్ మసాలా' సాంగ్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. సంక్రాంతికి విడుదల కానున్న నేపత్యంలో చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Also Read: Salaar Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ.. 500 కోట్లతో ప్రభాస్ ఊచకోత

ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం సినిమాలోని "కుర్చీ మడతపెట్టి" సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో మహేష్ బాబు మాస్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మహేష్ మహేష్ బాబు అభిమానులకు ఈ మాస్ బీట్ తో మంచి కిక్ ఇచ్చారు. ఈ సాంగ్ సంబంధించిన ప్రోమోను మహేష్ బాబు కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ పాటకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సరస్వతి పుత్ర, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

Also Read: Guntur Kaaram Song: ‘ఓహ్‌ మై బేబీ..’ వచ్చేసింది.. మహేశ్‌బాబు-శ్రీలీల కిరాక్‌ కాంబో..!

Advertisment
తాజా కథనాలు