Salaar Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ.. 500 కోట్లతో ప్రభాస్ ఊచకోత బాక్సాఫీస్ వద్ద సలార్ వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ దాటేసి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. By Archana 28 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Salaar Collections: బాహుబలి తర్వాత.. ప్రభాస్ (Prabhas) నుంచి ఆ రేంజ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సలార్ తో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చారు డార్లింగ్. బాహుబలి (Baahubali), కేజీఎఫ్ (KGF) రికార్డులను బ్రేక్ చేయడానికి సలార్ సిద్ధంగా ఉంది. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది సలార్. ఫస్ట్ డే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను చేసింది. మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 208 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ దాటేసి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేసింది. క్రిస్మస్ హాలిడే సందర్భంగా సలార్ కలెక్షన్స్ జోరు మరింత పెరిగింది. డిసెంబర్ 25 ఒక్కరోజే 40 కోట్ల వసూళ్లు రాబట్టి ఈ వారాన్ని ఘనంగా ప్రారంభించింది. రిలీజైన ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ దాటేసి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. నాలుగవ రోజు సలార్ (Salaar) తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డ్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి సలార్ 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ వారం కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నైజాంలో బ్రేక్ ఈవెన్ అందుకున్న సలార్ లాభాల బాట పట్టింది. సలార్ జోరు ఇలాగే కొనసాగితే.. న్యూ ఇయర్ వచ్చేలోపే 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. సినిమాలో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, BGM, డైలాగ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా కీలక పాత్ర పోషించాడు. శృతిహాసన్, జగపతిబాబు, ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. 𝑫𝑬𝑽𝑨 𝑹𝑬𝑷𝑨𝑰𝑹𝑰𝑵𝑮 𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑹𝑬𝑪𝑶𝑹𝑫𝑺 💥#SalaarCeaseFire has crossed a massive ₹ 𝟓𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 at the worldwide box office (𝐆𝐁𝐎𝐂) Nizam Release by @MythriOfficial#SalaarCeaseFireHits500Crs#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/CMignAFpLq — Mythri Movie Makers (@MythriOfficial) December 28, 2023 Also Read: Salaar Collections: క్రిస్మస్ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్ సలార్! #salaar-collections #prabhas-salaar-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి