/rtv/media/media_files/2025/04/12/8y8Rkwegaqrtmb4ebrjQ.jpg)
milk
Milk: పాలు జీవితంలో ఒక విడదీయలేని భాగం. టీ, కాఫీ, మజ్జిగ, పెరుగు, పన్నీర్, చీజ్, బట్టర్ ఇలా అన్ని రూపాల్లో పాలు జీవనశైలిలో భాగమైపోయాయి. ఈంతగా విస్తరించడానికీ, వినియోగించడానికీ కారణం పాలలో ఉన్న పోషక విలువలు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్స్ ఏ, డి, బి12, మైక్రో మినరల్స్ పాలు ద్వారా లభిస్తాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు మెదడు చురుకుగా, కంటిచూపు శరీరానికి తక్షణం ఎనర్జీని, నిద్రలేమి సమస్యకు ఉపశమనం ఇస్తుంది.
పాల వల్ల ప్రయోజనాలు:
శరీరంలో వైరస్లు, బ్యాక్టీరియాలు పోయేందుకు పసుపు, మిరియాలు, శొంఠి వంటి పదార్థాలను పాలలో కలిపి తాగితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి కంటే పాలు తాగడం వల్ల దాహం త్వరగా తీరుతుంది. ఎందుకంటే పాలలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. పాల రుచి ఇష్టపడని వారు అందులో కార్న్‌ఫ్లేక్స్, నట్స్, ఓట్స్ వంటివి కలిపి తీసుకోవచ్చు. పాలు జీర్ణం కాకపోతే సోయా, బాదం, కొబ్బరి పాలు వంటి వినియోగించవచ్చు. పాలను తాగితే బరువు పెరుగుతారన్నది అపోహ. కొవ్వు ఎక్కువగా ఉన్న పాలలో ఉండే బయో యాక్టివ్ పదార్థాలు శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంలో, ఎముకల బలహీనత, పగుళ్లు వంటి సమస్యను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: పైల్స్ రోగులు ఈ ఐదు పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే అంతే సంగతి!
పాలలోని కాల్షియం, విటమిన్ డి ఫ్యాట్స్ క్యాన్సర్ కణాలను ఎదుర్కొనగల సామర్థ్యం ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 2025 సంవత్సరం లెక్కల ప్రకారం.. భారత్ వార్షికంగా 200 మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా పాలను ఉత్పత్తి చేస్తోంది. అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడమే దీనికి ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది థీమ్ లెట్స్ సెలబ్రేట్ ది పవర్ ఆఫ్ డెయిరీగా ఉంది. పాలు కేవలం ఆహారం కాదు.. ఆరోగ్యానికి, ఆర్థికాభివృద్ధికి నిలువెత్తు సంకేతం. అందుకే పాలను గౌరవంగా చూసి, వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)