సాధారణంగా చలికాలంలో జుట్టు పొడిబారడం వల్ల ఎక్కువగా రాలుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించాలంటే చలికాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో తేమ వల్ల జుట్టు పొడిగా మారుతుంది. దీంతో జుట్టు చివర్లు పగుళ్లు రావడం, అధికంగా రాలిపోవడం, పలుచగా మారిపోవడం వంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. ఈ సమస్యలు లేకుండా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని హోం రెమిడీస్ పాటించాలి. మరి పాటించాల్సిన ఆ హోం రెమిడీస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు.. కాచిన నూనెను తలకి అప్లై చేయండి చలికాలంలో జుట్టుకు గోరువెచ్చని నూనె అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసే గంట ముందు తలకి గోరు వెచ్చని నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత కుదుళ్ల నుంచి నెమ్మదిగా మసాజ్ చేసి వదిలేయాలి. గంట లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ తలకి అప్లై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది కూడా చూడండి: SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో.. రసాయన ఉత్పత్తులకు దూరంగా.. సల్ఫేట్, పారాబెన్ వంటి రసాయనాలు లేని షాంపూలను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని రసాయనాలు జుట్టు రాలే సమస్యను ఎక్కువగా పెంచుతాయి. కాబట్టి సహజ సిద్ధమైన సికాయ్, కుంకుడికాయ లేదా నేచురల్ షాంపూలు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్.. వేడి నీటితో తలస్నానం వద్దు చలి వల్ల కొందరు వేడి నీటితో స్నానం చేస్తారు. దీనివల్ల జుట్టు కుదుళ్ల నుంచి దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. చల్లని నీటితో చేయలేని వారు కాస్త గోరువెచ్చని నీరుతో అయిన చేయవచ్చు. కానీ చల్లని నీరుతోనే తలస్నానం చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.