/rtv/media/media_files/2025/11/13/dry-skin-2025-11-13-11-23-39.jpg)
Dry Skin
చలికాలంలో చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. మాయిశ్చరైజేషన్ ఉపయోగించినా కూడా చర్మంపై పగుళ్లు వస్తాయి. దీనివల్ల అందవిహీనంగా కనిస్తారు. అయితే ఈ కాలంలో చర్మంపై ఎలాంటి పగుళ్లు రాకుండా పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మాయిశ్చరైజర్
మంచి క్వాలిటీ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఈ సీజన్‌లో ఉపయోగించాలి. రోజుకు ఒకసారి కాకుండా రెండు లేదా మూడుసార్లు ఈ లోషన్‌ను రాసుకోవాలి. దీనివల్ల చర్మం పగుళ్లు రాదు. ముఖ్యంగా స్నానం చేసిన వెంటనే, చర్మం కొంచెం తేమగా ఉన్నప్పుడు రాస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే పెదాలు కూడా పగిలిపోతుంటాయి. నెయ్యి, వెన్న లేదా లిప్ బామ్ వాడుతుండాలి.
Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!
స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు
స్నానం చేసే విధానంలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు. బాగా వేడిగా ఉన్న నీళ్లతో కాకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్లతో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ సమయం స్నానం చేయకుండా తక్కువ సమయం మాత్రమే స్నానం చేయాలి. చర్మాన్ని ఎక్కువగా పొడి బార్చే సబ్బులు కాకుండా తేమగా ఉండే సబ్బులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
గాలి తగలకుండా కేర్
బయటకు వెళ్లేటప్పుడు చలి గాలి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. ఉన్ని దుస్తులు నేరుగా చర్మానికి తగలకుండా, వాటి కింద పత్తి ఉంటే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వాటర్ ఎక్కువగా తాగాలి
ఈ సీజన్‌లో చాలా మంది తక్కువగా వాటర్ తాగుతారు. అయితే దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ అయి చర్మంపై పగుళ్లు వస్తాయి. అదే వాటర్ తాగడం వల్ల చర్మం కూడా మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Relationship Tips: మీ పార్ట్‌నర్‌కు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు.. ఈ చిన్న బహుమతులే వెలకట్టలేని ఆనందం!
Follow Us