/rtv/media/media_files/2025/11/12/health-tips-2025-11-12-17-25-23.jpg)
సాధారణంగా మనలో చాలా మందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఉత్సాహంగా అనిపించినప్పటికీ.. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీర శక్తి, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ఇలాంటి అలవాటు ఉన్నవారు.. వెంటనే మార్చుకోవాలని లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
తిన్న తర్వాత భోజనం వల్ల సమస్యలు
భోజనం తర్వాత స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆచార్య మనీష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దీని వల్ల ఏ ఏ సమస్యలు వస్తాయో కూడా ఆయన వివరించారు. ఈ అలవాటు జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా శరీర శక్తిని కూడా తగ్గిస్తుందని అన్నారు. అలాగే ఈ అలవాటు దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
జీర్ణక్రియ బలహీనం
ఆచార్య మనీష్ ప్రకారం.. భోజనం చేసిన వెంటనే స్నానం చేసేవారిలో జీర్ణక్రియ సరిగా ఉండదు. భోజనం చేసినప్పుడు శరీరంలోని జీర్ణాశయం వేడిగా మారుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అయితే స్నానం చేసిన వెంటనే.. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ నుండి చర్మానికి రక్త ప్రవాహాన్ని మారుస్తుంది. జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. సరైన జీర్ణక్రియను నిరోధిస్తుంది.
అంతే కాకుండా భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. పదే పదే ఇలా చేయడం వల్ల బరువుగా, నీరసంగా అనిపిస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అందువల్ల స్నానం చేయాలనుకుంటే.. తిన్న వెంటనే కాకుండా కనీసం 1 నుండి 2 గంటల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి వీలు కల్పిస్తుంది. శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపదు.
కాగా మీరు ఉదయం భోజనం చేయక ముందు స్నానం చేయడానికి ప్రయత్నిస్తే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఇది మీ శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. రోజంతా శక్తినిస్తుంది.
Follow Us