Relationship Tips: మీ పార్ట్‌నర్‌కు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు.. ఈ చిన్న బహుమతులే వెలకట్టలేని ఆనందం!

ఏ బంధమైన బలపడాలంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మంచిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ మాట్లాడటం, కలిసి అన్ని పనులు చేసుకోవడం, స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండి టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేస్తే బంధం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.

New Update
Relationship

Relationship

ఏదైనా బంధం బలపడాలంటే ఇద్దరి సైడ్ నుంచి కూడా అర్థం చేసుకునే గుణం ఉండాలి. అయితే కొందరు పార్ట్‌నర్స్ ఎక్కువగా కాస్ట్లీ గిఫ్ట్స్ వంటివి కోరుకుంటారు. మరికొందరు పార్ట్‌నర్ నుంచి కాస్త సమయం, ప్రేమ వంటివి ఇవ్వాలని అనుకుంటారు. అయితే బాగా ఖరీదైన గిఫ్ట్‌లే కాకుండా చిన్న బహుమతులు ఇస్తే వారికి వెలకట్టలేని ఆనందం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చదవండి: ఉదయం 5 గంటలకు మేల్కొంటే సంతోషం, విజయం మీ సొంతం.. కారణాలు తెలుసుకోండి!!

రోజు మాట్లాడటం

మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం కేటాయించాలి. మీరు ప్రతిరోజూ మీ భాగస్వామితో మాట్లాడటం వల్ల మీ ఇద్దరి మధ్య బాండ్ పెరుగుతుంది. ఎలాంటి అపార్థాలు ఉన్నా కూడా తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.

మాట్లాడమే కాదు వినాలి 
మాట్లాడటం ఎంత ముఖ్యమో జాగ్రత్తగా వినడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. భాగస్వాములు ఒకరి మాటలు ఒకరు విని.. గౌరవించుకోవాలి. అప్పుడు సంబంధాలు ఇంకా బలపడతాయని చెబుతున్నారు. 

ప్రేమను వ్యక్తపరచండి
చిన్న చిన్న విషయాల ద్వారా మీ ప్రేమను పార్ట్‌నర్‌కు వ్యక్త పరచండి. దీనివల్ల వారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఖరీదైన గిఫ్ట్‌లు కాకుండా ఇలా ఉండటం వల్ల వారు ఎంతో ఆనంద పడతారు.

కలిసి పనిచేయడం
ఎంత బిజీగా ఉన్నా కూడా ఇద్దరూ కలిసి పనిచేయడం, ఇంటి పనులు కలిసి చేసుకోవడం వంటివి చేయాలి. వీటివల్ల ఇద్దరి మధ్య బాండ్, అండర్ స్టాండింగ్ అన్ని కూడా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండండి
ఫోన్లకు కాస్త దూరంగా ఉండి ఇద్దరు కలిసి కొంత సమయం గడపాలి. సరదాగా జోక్స్ వేస్తూ మాట్లడుకోవాలి. దీనివల్ల ఇద్దరి అండర్‌స్టాండింగ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు