/rtv/media/media_files/2025/04/25/KbWwlza6T6oOlwYxfxPy.jpg)
Weight loss
నేటి బిజీ జీవితంలో మారుతున్న ఆహార అలవాట్ల వల్ల ఊబకాయం సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల ఎక్కువగా ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కేవలం నెల రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గాలంటే మాత్రం మీరు తప్పకుండా 30-30-30 రూల్ పాటించాలని నిపుణులు అంటున్నారు. మరి ఈ రూల్‌తో ఈజీగా బరువు తగ్గడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
ఈ రూల్ పాటిస్తే..
నిద్ర లేచిన 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన అరగంటలోపు, మీరు మీ అల్పాహారంలో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్‌ను చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారాలు తీసుకోవాలి. అంటే గుడ్లు, గ్రీకు పెరుగు, కాటేజ్ చీజ్, కాయ ధాన్యాలు, టోఫు లేదా ప్రోటీన్ షేక్‌లు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
అల్పాహారం తర్వాత మీరు 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇందులో చురుకైన నడక, సైక్లింగ్, ఈత, యోగా లేదా నృత్యం, హృదయ స్పందన రేటును కొద్దిగా పెంచే ఏదైనా చేయవచ్చు. దీనివల్ల మీరు బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఈ నియమం 30 రోజుల పాటు డైలీ సరిగ్గా పాటించడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Konda Murali: నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్