Weekly Horoscope: వారమంతా ఈ రాశుల వారికి అదృష్టమే.. కోరిన పనులన్నింటిలో విజయం తథ్యం!

ఈ వారం కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఎలాంటి సమస్యలు రాకుండా కోరిన పనులన్నింటిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
horoscope

horoscope

ఈ వారం కొన్ని రాశుల(zodiac-signs) వారికి మంచి జరగనుంది. ఎలాంటి సమస్యలు రాకుండా కోరిన పనులన్నింటిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read :  ముక్కు పొడిబారి ఊపిరి ఆడట్లేదా..? అయితే మీరు వినికిడి కోల్పోవచ్చు నిర్లక్ష్యం చేయకండి..!!

మేషం

మీరు చేసే ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి. సూర్యభగవానుడి శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారంలో బలం పెరుగుతాయి. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకుంటారు.

వృషభం
అదృష్టకాలం కొనసాగుతోంది. మనోబలంతో ముఖ్య లక్ష్యాలపై గురిపెట్టండి, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. భూలాభం మరియు శుభకార్యాలు గోచరిస్తున్నాయి.

మిథునం 
వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మీ బుద్ధిబలం సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. సరైన ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. వారం మధ్యలో ఓ ఆపద నుంచి బయటపడతారు.

కర్కాటకం 
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ముఖ్య లావాదేవీల విషయంలో లోతుగా ఆలోచించండి. వ్యక్తిగత వ్యవహారాల్లో గోప్యత అవసరం.

సింహం 
లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంది. పనులు త్వరగా పూర్తవుతాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలను అందిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రగతి కనిపిస్తుంది.

కన్య
మనోబలంతో పనులను ఆరంభించండి. చంచలత్వం పనికిరాదు. కొత్త ప్రయోగాలకు ఇది సమయం కాదు. ఆదాయంతో పాటు ఖర్చులూ అధికంగా ఉండవచ్చు.

తుల 
ఏకాగ్రత ముఖ్యం. అశ్రద్ధ వల్ల సమస్యలు జటిలంగా మారే ప్రమాదం ఉంది. సహనాన్ని పరీక్షించేవారితో జాగ్రత్తగా ఉండాలి. శుక్రయోగంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.

వృశ్చికం 
దీర్ఘకాలిక ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. విజయం మీదే. ఉద్యోగంలో మేలు జరిగి, జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది.

ధనుస్సు
శుభకాలం కొనసాగుతోంది. భాగ్య శుక్రయోగం వల్ల మంచి జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

మకరం 
తొందరపాటు చర్యలు వద్దు. వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చకండి. నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి. వ్యాపారంలో శ్రద్ధతో నష్టాలను అధిగమించాలి.

కుంభం 
పనుల్ని వాయిదా వేయకండి. ఏకాగ్రతతో ముందుకు సాగండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

మీనం 
పరిస్థితులు అనుకూలంగా లేవు, కాబట్టి స్పష్టమైన ఆలోచనతో పనిచేయాలి. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం.

Also Read :  మధుమేహమే కాదు.. ఈ మూడు వ్యాధులు మీ జ్ఞాపకశక్తిని తినేస్తాయి తెలుసా..?

Advertisment
తాజా కథనాలు