/rtv/media/media_files/2025/04/03/bZfENuoXFYnJRHzd3CEd.jpg)
ganesh
Ganesh Chaturthi 2025: భారతదేశంలో జరుపుకునే పండగల్లో గణేష్ చతుర్థి అత్యంత ప్రీతికరమైన పండగ. ఈ పండగ వస్తుందంటే.. 10 రోజుల ముందు నుంచే నగరంలో సందడి మొదలవుతుంది. ప్రతి ఊరూ, ప్రతి గల్లీలో వినాయకుడి కోసం సిద్దమవుతున్న మండపాలు దర్శనమిస్తాయి. ప్రజలంతా కలిసి సామూహికంగా, కోలాహలంగా జరుపుకునే పండగ ఇది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 27న వినాయకచవితి పండగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున గణపయ్యను ఆయన కోసం సిద్ధం చేసిన మండపాల్లో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు.
అయితే వినాయకుడిని ప్రతిష్టించేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యమైనది. సరైన దిశ, ప్రదేశంలో గణపతిని ప్రతిష్టించడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది. అయితే చాలా మంది తెలిసి తెలియక కొన్ని వాస్తు పొరపాట్లు చేస్తుంటారు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
నివారించాల్సిన వాస్తు తప్పులు
తప్పు దిశ
వాస్తు నిపుణుల ప్రకారం.. వినాయకుడి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచరాదు. ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుందని చెబుతారు.
అపరిశుభ్రమైన ప్రదేశాలు
వినాయకుడి విగ్రహాన్ని బెడ్ రూమ్, బాత్రూమ్ లేదా కిచెన్ మెట్ల కింద ఉంచడాన్ని అగౌరవంగా పరిగణిస్తారు. ఎందుకంటే సాధారణంగా ఈ ప్రదేశాలను అపవిత్రంగా భావిస్తారు. అలాగే ఇవి నెగెటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయని చెబుతారు. ఈ ప్రదేశాల్లో ఉంచడం ద్వారా మీరు చేసిన పూజలకు ఫలితం లేకుండా పోతుంది.
నేరుగా నేల మీద
గణపయ్య ప్రతిమను నేరుగా నేల అస్సలు ఉంచరాదు. ఒక పీట లేదా ఏదైనా ఎత్తైన వేదికపై వినాయకుడిని ప్రతిష్టించాలి. ఇది ఆ విజ్ఞానాయకుడిగా అందించే గౌరవం.
ఎక్కువ విగ్రహాలు
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉంచుకోరాదని పండితులు చెబుతున్నారు. ఎక్కువ విగ్రహాలు శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయట.
ఎక్కువ అలంకరణ
విగ్రహం చుట్టు ఉన్న ప్రదేశమంతా ఖాళీగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గణపయ్య చుట్టు వస్తువులు, ఇతర అలంకరణ ఐటమ్స్ ఎక్కువగా ఉంచరాదు. అలాగే విరిగిపోయిన లేదా పగిలిపోయిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం అశుభం.
పూజలో నిర్లక్ష్యం
వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత నిమజ్జనం చేసేవరకు ఆయనకు నిత్య పూజలు జరిపించాలి. ప్రతిరోజూ పూజలు, భజనలతో గణపయ్యను ఆరాధించాలి. వాడిపోయిన పువ్వులు, దుమ్ము పట్టిన వస్తువులు, మిగిలిపోయిన ప్రసాదాలను ఆయన ముందు ఉంచరాదు. ఇది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అలాగే మొదటి రోజు పూజ తర్వాత వినాయకుడిని ఒంటరిగా వదిలేయరాదు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Also Read: Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే.. శుభ ముహూర్తం, పూజా విధానం