Snake Eggs: పాము గుడ్లు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే అవునా.. నిజమా.. అని అవాక్కవుతారు..!

పాము గుడ్లలో విషం ఉండదని నిపుణులు చెబుతున్నా, కానీ వాటిని తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. సాల్మొనెల్లా బ్యాక్టీరియా, అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో పాము గుడ్లు తినడం చట్టరీత్యా నేరం కూడా. ప్రోటీన్ కోసం కోడి గుడ్లే సురక్షితం.

New Update
Snake Eggs

Snake Eggs

Snake Eggs: ఇటీవల సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రశ్న చాలా మందిలో కలుగుతోంది. అదేంటంటే “పాము గుడ్లు తింటే చనిపోతామా? ఒకేసారి ఐదు పాము గుడ్లు తింటే శరీరానికి ఏమవుతుంది?” అనే సందేహాలు తరచూ వినిపిస్తున్నాయి. గుడ్లు అంటే ఆరోగ్యం, ప్రోటీన్ అని అలవాటు పడిన మనకు ఈ ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించినా, దీనికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడం చాలా అవసరం.

సాధారణంగా భారతదేశంలో కోడి గుడ్లు, నాటు కోడి గుడ్లు, కడక్‌నాథ్ గుడ్లు లాంటి వాటిని ఆరోగ్యానికి మంచివిగా తీసుకుంటారు. ఆమ్లెట్, ఎగ్ భుర్జీ, ఎగ్ కర్రీ ఇలా ఎన్నో రకాలుగా గుడ్లు మన ఆహారంలో ఉంటాయి. కానీ పాము గుడ్లు కూడా తినవచ్చా అనే ఆలోచన చాలా మందిలో భయం కలిగిస్తుంది.

చాలామందికి పాము గుడ్లలో విషం ఉంటుందని నమ్మకం ఉంది. అయితే నిపుణులు చెబుతున్నది వేరే. నిపుణుల ప్రకారం, పాము విషం దాని దంతాల దగ్గర ఉన్న విష గ్రంథుల్లో మాత్రమే తయారవుతుంది. గుడ్లలో విషం ఉండదు. కాబట్టి పాము గుడ్లు తినగానే విషం శరీరంలోకి వెళ్లి వెంటనే చనిపోతాం అనేది నిజం కాదు. అయితే గుడ్డులో పాము పూర్తిగా ఎదిగిన స్థితిలో ఉంటే, ఆరోగ్యానికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

విషం లేకపోయినా పాము గుడ్లు తినడం మాత్రం చాలా ప్రమాదకరం అని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. పాము గుడ్లలో సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ. ఇవి శరీరంలోకి వెళ్లితే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు తీవ్రంగా రావచ్చు. కొంతమందికి పాము గుడ్లలోని ప్రోటీన్ల వల్ల అలెర్జీ కూడా ఏర్పడవచ్చు. దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అంతేకాదు, అడవి జంతువుల గుడ్లలో ఉండే పరాన్నజీవులు మన శరీరానికి మరింత హాని చేస్తాయి.

చైనా, వియత్నాం, కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో పాము మాంసం, పాము గుడ్లు తినే అలవాటు ఉంది. అక్కడ వీటిని ఔషధ గుణాలు ఉన్న ఆహారంగా భావిస్తారు. అయినా కూడా, అక్కడ పాము గుడ్లను చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలో పూర్తిగా ఉడికించిన తర్వాతే తింటారు. బ్యాక్టీరియా నశించాలనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు.

Also Read: పనికి రాని మెడిసిన్ తో పరువు తీసుకున్న పాక్.. భారత్ మందులకు మస్త్ డిమాండ్.. అసలేమైందంటే?

భారతదేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వన్యప్రాణుల రక్షణ చట్టం - 1972 ప్రకారం పాములు వన్యప్రాణులు. వాటికి లేదా వాటి గుడ్లకు హాని కలిగించడం చట్టరీత్యా నేరం. పాము గుడ్లు సేకరించడం లేదా తినడం వల్ల జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, మన సంస్కృతిలో పాములను పూజించే సంప్రదాయం కూడా ఉంది.

మొత్తానికి చెప్పాలంటే, పాము గుడ్లు తింటే వెంటనే చనిపోతాం అనేది నిజం కాకపోయినా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చట్టపరమైన సమస్యలు తప్పవు. ప్రోటీన్ కోసం ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి సురక్షితంగా ఉండాలంటే అందుబాటులో ఉన్న కోడి గుడ్లే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు