Belly Fat: ఇవి తిన్నారంటే కొండలాంటి పొట్టైనా ఇట్టే కరుగుద్ది

పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్‌ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్‌, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుంది. ఇవి పొట్టకొవ్వును తగ్గించడంలో సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయంటున్న నిపుణులు.

New Update
Belly Fat

Belly Fat

Belly Fat: స్లిమ్ అవ్వాలని లేదా కొవ్వును తగ్గించుకోవాలని చూస్తుంటే సరైన వ్యాయామం, డైట్‌ ఫాలో కావాలి. ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని కూరగాయలు అదనపు కొవ్వును కోల్పోవటానికి సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

బచ్చలికూర:

  • బచ్చలికూర పోషకాలతో నిండి ఉంటుంది. ఇది పొట్ట కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ కూరగాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. దీనిలోని థైలాకోయిడ్స్ ఆకలిని 95శాతం తగ్గిస్తాయి. ఆహారంలో బచ్చలికూరను జోడించాలనుకుంటే సలాడ్లు, స్మూతీగా తీసుకోవచ్చు. ఇందులోని అధిక మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, బరువు నిర్వహణలో మరింత సహాయపడుతుంది.

పొట్లకాయ:

  • ఇందులో కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా వాటర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సరైన ఆహారం. ఒక అధ్యయనం ప్రకారం పొట్లకాయలోని అధిక నీరు, ఫైబర్ కంటెంట్ కేలరీలు తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. సాదా కూర, రసం లేదా కూలింగ్ రైతాగా చేసుకుని పొట్లకాయ తినవచ్చు.

కాలీఫ్లవర్:

  • కాలీఫ్లవర్ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడే మరొక కూరగాయ. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాలీఫ్లవర్‌లో ఇండోల్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో, బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు అంటున్నారు.

క్యారెట్‌:

  • క్యారెట్లు కంటి చూపుకే కాదు నడుముకు కూడా మేలు చేస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. క్యారెట్‌లను పచ్చిగా లేదా వండిన క్యారెట్‌లను సబ్‌లు, సూప్‌లు, సలాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: X-ray: అసలు ఎక్స్-రే అనేది ఎలా మొదలైంది?

దోసకాయ:

  • దోసకాయలు చాలా రిఫ్రెష్, హైడ్రేటింగ్‌గా ఉంటాయి. అధిక నీటి కంటెంట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. దోసకాయలు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు బరువు నిర్వహణలో సహాయపడతాయని వైద్యులు అంటున్నారు.

బ్రోకలీ:

  • బ్రోకలీ పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయ. ఫైబర్, ఫ్యాట్ బర్నింగ్‌ను ప్రోత్సహించే సమ్మేళనాలతో ఉంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఆస్తమా వేధిస్తుందా..? అయితే ఈ చిట్కాలు పాటించేయండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు