X-ray: అసలు ఎక్స్-రే అనేది ఎలా మొదలైంది? వైద్య రంగంలో శరీరంలోని వ్యాధులను గుర్తించేందుకు ఎక్స్ రే ఉపయోగించారు. 1895లో నోబెల్ గ్రహీత విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్-రే సాంకేతికతను కనుగొన్నారు. ఈ కిరణాలు శరీరంలోని కణజాలం గుండా వెళ్లి కణాలను గుర్తించగలవని గ్రహించారు. By Vijaya Nimma 09 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update X-ray షేర్ చేయండి X-ray: వైద్యరంగంలో రేడియాలజీ చాలా ముఖ్యమైన భాగం. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 20వ శతాబ్దం తర్వాత ఈ రేడియాలజీ సాంకేతికత మరింత అభివృద్ధి చెందింది. కృత్రిమ మేధస్సు దీనికి మరింత మద్దతునిచ్చింది. 1895లో నోబెల్ గ్రహీత విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్-రే సాంకేతికతను కనుగొన్నారు. తరువాత రోంట్‌జెన్ దీనిని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఈ కిరణాలు మన శరీరంలోని కణజాలం గుండా వెళ్లి కణాలను గుర్తించగలవని గ్రహించారు. అతను తన భార్య చేతి చిత్రాన్ని ఫోటోగ్రాఫిక్ ఫ్లాట్‌లో ఉంచినప్పుడు చేతి ఎముకలు, ఉంగరం కనిపించాయి. ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ మొట్టమొదటి మానవ ఎక్స్-రే: ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ ఎక్స్-రే. ఈ విషయంలో రేడియోగ్రఫీ పరికరాలు, విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్‌జెన్ వైద్య రంగానికి అందించిన సహకారాన్ని స్మరించుకోవడానికి యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ సహకారంతో ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నారు. 2012లో మొదటిసారి నవంబర్ 8న జరుపుకున్నారు. ఇది కూడా చదవండి: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం X-ray, MRI, అల్ట్రాసౌండ్ వంటి రేడియోగ్రఫీ సాధనాలు వ్యాధికి మూల కారణాలను కనుగొనడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. రోగులకు సకాలంలో వైద్యం అందుతుంది. ఈ పరికరాల ప్రయోజనాలు, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా రేడియోగ్రఫీ దినోత్సవం లక్ష్యం. అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రేడియాగ్రఫీ వృత్తిని తదుపరి తరానికి ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: కాఫీలో పంచదార వేసుకోకపోతే.. వచ్చే అద్భుత లాభాలు ఇవే!! ఇది కూడా చదవండి: చూసేందుకు చిన్న చేప..సౌండ్ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది #what is x-ray #x ray full form #x-ray-polarimetry-satellite మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి