/rtv/media/media_files/2025/08/06/raksha-bandhan-2025-2025-08-06-20-17-06.jpg)
Raksha Bandhan 2025
అక్క లేదా చెల్లికి నేను ఉన్నానని సోదరుడు భరోసా కోసం రాఖీ(Rakhi) కడతారు. ఈ రాఖీ పండుగ(Raksha Bandhan 2025) ను ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి నాడు ఘనంగా జరుపుకుంటారు. సోదరుడిలు దూరంగా ఉన్నా కూడా రాఖీను తప్పకుండా పంపుతారు. అయితే ప్రస్తుతం రోజుల్లో అయితే వెండి, బంగారం వంటి రాఖీలు వచ్చాయి. దీంతో వాటిని డైరెక్ట్‌గా చేతికి పెడుతున్నారు. కానీ పూర్వం రోజుల్లో మాత్రం రాఖీని దారాలతో కట్టేవారు. ఏదో ఒక ముడి లేదా రెండు ముళ్లు వేసి కట్టేయడం రాఖీ కాదు. తాళి కట్టినప్పుడు ఎలా మూడు ముళ్లు వేయాలో.. రాఖీ కట్టేటప్పుడు కూడా తప్పకుండా కొన్ని ముడులు వేస్తేనే మంచిదని పండితులు అంటున్నారు. మరి రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేస్తే మంచిది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా?
మూడు ముళ్లు మాత్రమే వేయాలని..
సోదరుడికి ఏదో రాఖీ కట్టేయడం కాదు. ఎప్పటికి మీకు రక్షగా ఉండాలని చెప్పడంతో పాటు సోదరుడి గొప్పగా, ఉన్నత స్థాయిలో ఉండాలని సోదరులు కోరుకుని రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మూడు మూళ్లు అనేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. త్రిమూర్తులకు ప్రతీకగా తమ సోదరుడు సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్లు వేయాలి. రాఖీ కట్టేటప్పుడు వేసే మొదటి ముడి, సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, శ్రేయస్సు, ఆనందాన్ని సూచిస్తుంది. రెండో ముడి అయితే సోదరుడు, సోదరి(Sister) మధ్య నమ్మకం, ప్రేమ, గౌరవాన్ని సూచిస్తుందని, మూడో ముడి గౌరవంతో సంతోషంగా జీవించాలని సూచిస్తుందని పండితులు అంటున్నారు. ఇలా మూడు ముళ్లు వేయకుండా రాఖీ కట్టడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని పండితులు చెబుతున్నారు.
ఈ రంగు రాఖీ కడితినే మంచిదట..
చాలా మంది వేేరే రంగులో ఉండే రాఖీలను కడుతుంటారు. అయితే ఎరుపు, పసుపు, తెలుపు రంగుల దారాల్లో ఉన్న రాఖీలను మాత్రమే కట్టాలని పండితులు చెబుతున్నారు. ఈ రంగు దారం ఉన్న రాఖీలను కట్టడం వల్ల సోదరుడికి, సోదరురాలికి కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. వీరిద్దరి మధ్య బంధం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కొందరు కేవలం రాఖీ సమయాల్లో మాత్రమే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కనీసం పట్టించుకోరు. ఇలాంటి వారు ఎరుపు రంగు రాఖీని కట్టడం వల్ల ఒకరికొకరు సంతోషంగా, బంధం విలువ తెలిసేలా ఉంటారని అంటున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ రూల్స్ పాటించి రాఖీ కట్టండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Vastu Tips: ఇంట్లో ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే.. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు!