/rtv/media/media_files/2025/04/14/aPqgkYugfugbeqKT51pY.jpg)
zodiac signs today
మేషం
ఈరోజు మేష రాశి వారికి శుభ సూచికంగా కనిపిస్తోంది. తలపెట్టిన పనులు, అనుకున్న కార్యాలు సమయానికి పూర్తవుతాయి. ఇది మీ జీవితంలో సంతోషాన్ని, ఆనందన్ని కలిగిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులు విషయంలో ప్రణాళికతో వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశి వారు ఈరోజున శివుడిని పూజిస్తే మనకు ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈరోజు స్నేహితుల మద్దతు శుభఫలితాలను అందిస్తుంది. వారి సహాయంతో పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యాపార విషయానికి వస్తే.. ఏదైనా మొదలు పెట్టె ముందు పెద్దలు, అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూల దైవం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని.
మిథున
మిథున రాశివారికి సమయ పాలను చాలా ముఖ్యం. సమయాన్ని వృధా చేయకుండా సరిగ్గా వాడుకుంటే విజయం వైపు నడిపిస్తుంది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కావున ఏదైనా మాట్లాడే ముందు క్లారిటీగా మాట్లాడం మంచింది. ఆత్మవిశ్వసంతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు.
కర్కాటకం
మీ నిరంతర ప్రయత్నాలు మీకు మంచి విజయాన్ని అందిస్తాయి. స్నేహితుల సాయంతో మీరు మొదలుపెట్టిన పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. మీరు విజయం సాధించాలంటే ఓర్పు, నైపుణ్యం చాలా ముఖ్యం. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి దుర్గాదేవిని ధ్యానించండి.
సింహం
మీరు చేపట్టిన పనుల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సమయాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం చాలా ముఖ్యం. మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిది.
Also Read: Viral Fever: రుతువులు మారుతున్న కొద్ది అనారోగ్యం.. వైరల్ జ్వరానికి ఆయుర్వేద వైద్యం!!
కన్య
మీరు ఏ పనిలోనైనా శ్రద్ధగా, పట్టుదలతో ఉంటే విజయం ఖాయం. ఒక కొత్త పనిని మొదలుపెట్టే ముందు ఇంట్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీలోని మంచి ఆలోచనలు మీ ప్రయత్నాలకు బలాన్నిస్తాయి. డబ్బు, సమయం అనవసరంగా ఖర్చు కాకుండా చూసుకోండి. గొడవలకు దూరంగా ఉంటూ, ఆలోచించి వ్యవహరించడం ఉత్తమం. గణపతి ఆరాధన శుభాలను తెస్తుంది.
తుల
మీరు చేసే పనుల్లో ముందుగానే అంచనా వేసి గొప్ప విజయం సాధిస్తారు. మీ సహోద్యోగుల సహాయంతో పనులు చాలా సులభంగా అయిపోతాయి. మీ పని పట్ల అంకితభావమే మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబం గురించి మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సూర్యుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చికం
ఏ పని మొదలుపెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు వదలకుండా ముందుకు సాగి విజయం సాధిస్తారు. సమస్యలను పరిష్కరించడానికి ధైర్యంగా నిలబడండి. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీకు లాభాలను తెస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడండి. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ధ్యానిస్తే మనోధైర్యం పెరుగుతుంది.
ధనుస్సు
మీ మనోబలం వల్ల అన్ని విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎలాంటి నిర్ణయాలైనా తొందరపడకుండా, నిదానంగా తీసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం మీకు తోడ్పడుతుంది, ఇది మీకు మరింత శక్తినిస్తుంది. శివుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మకరం
మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మీ ప్రతి ప్రయత్నం ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాలలో మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అదృష్టం లభిస్తుంది.
కుంభం
మీ పనుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, మీ బలమైన సంకల్పంతో వాటిని సాధిస్తారు. మీరు చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. మీ కష్టానికి సరైన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఎవరినీ ఎక్కువగా నమ్మి మోసపోకుండా ఉండటానికి జాగ్రత్త వహించండి. దుర్గాదేవిని పూజిస్తే మీకు మరింత బలం లభిస్తుంది.
మీనం
మీ కష్టానికి మంచి ప్రతిఫలం ఉంటుంది. నిరాశ పడకుండా మీరు పని చేసుకుంటూ పోతే విజయం మీకు దగ్గరవుతుంది. మిమ్మల్ని విమర్శించే వారి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఆలోచించి వ్యవహరిస్తే సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం చాలా అవసరం. శ్రీ సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటే మంచిది.
Also Read : అకస్మాత్తుగా అలా అనిపిస్తోందా..? ఇది SADకి సంకేతం.. అంటే ఏంటో తెలుసా..?