Today Horoscope: నేడు ఈ రాశుల వారి పంట పండినట్లే.. ఏ పని తలపెట్టిన విజయం తథ్యమే!

నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా విజయం తథ్యమే అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో తెలుసుకుందాం.

New Update
horoscope 2025 today

horoscope 2025 today

నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. అయితే నేడు అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో(horoscope-today) తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రోజు మీరు మొదలుపెట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే మీ తెలివితో వాటిని సులభంగా అధిగమించవచ్చు. అలాగే నేడు మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా సూర్యాష్టకం చదవడం మంచిదని పండితులు అంటున్నారు. 

వృషభ రాశి

మీ మనసులో అనుకున్న పనులను ఈ రోజు తప్పకుండా సాధిస్తారు. అవసరమైనప్పుడు మీకు సహాయం చేసేవారు కూడా ఉంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఇష్టపడే దేవుడిని పూజిస్తే ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. 

మిథున రాశి

మీ ఉద్యోగం, వ్యాపారాల్లో ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే బంధువులు, స్నేహితులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఓ సంఘటన మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుందని జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. 

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఒక శుభవార్త వింటారు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు చెప్పకుండా వారి మాట వినాలి. అప్పుడే మీకు అన్ని విధాలుగా అనుకున్న  పనులు జరుగుతాయని  పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించడం వల్ల ప్రశాంతంగా ఉంటారు.

సింహ రాశి

మీరు మొదలుపెట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. అలాగే మీ బంధాలను మరింత గట్టిగా చేసుకోవాలి. చిన్న విషయాలకు కూడా గొడవలు పడకూడదు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. విష్ణు సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల శుభం కలుగుతుంది.

Also Read :  శివుడికి అత్యంత ఇష్టమైన సమయం.. నేడు ఈ టైమ్‌లో పూజ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరడం ఖాయం!

కన్య రాశి

ఈ రోజు మీరు మీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారాల్లో మీకు మంచి వాతావరణం ఉంటుంది. మీ అధికారం పెరుగుతుంది. మీ పిల్లల గురించి ఒక మంచి వార్త వింటారు. గణనాయక అష్టకం చదవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది.

తులా రాశి

ఈ రోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే పనుల్లో మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇష్టమైన దేవుడిని పూజిస్తే మరింత మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు పెద్దల సహాయం మీకు లభిస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

మకర రాశి

ఈ రోజు మీరు మొదలుపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే కుటుంబంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

కుంభ రాశి

అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది. బంధువుల, స్నేహితుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. శివారాధన చేస్తే మంచిది.

మీన రాశి

ఈ రోజు మీకు మంచి సమయం. మీ అధికారం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.

Also Read :  ఈ జీవులు మీ ఇంటికి ఆనంద దూతలు.. వాటి రాక అదృష్టానికి సంకేతమని తెలుసా..?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
తాజా కథనాలు