/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
horoscope 2025 today
మేషం
ఉద్యోగంలో మీకు మంచి పేరు వస్తుంది. పనులు ఆగిపోకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు.
వృషభం
మొదలుపెట్టిన పనిని పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మొహమాటాల వల్ల ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.
మిథునం
ఇది మీకు చాలా మంచి రోజు. మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఒక మంచి వార్త మీ ధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం
కొందరి వల్ల మీకు ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు వద్దు. ముఖ్య విషయాల్లో అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం.
సింహం
పనులను సమయానికి పూర్తి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండాలి.
కన్య
లక్ష్యాలను చేరడానికి ఈ రోజు ఎక్కువ శ్రమ అవసరం. భవిష్యత్తు కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం పెరగడానికి దుర్గా దేవిని దర్శించండి.
Also Read : రోజుకు రెండు ఖర్జూర పండ్లు.. ఎన్నెన్నో ప్రయోజనాలు
తుల
అనుకున్న పనులు అవుతాయి. ఇతరులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. డబ్బు, కొత్త బట్టలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం
ధైర్యంగా ముందుకు వెళ్తారు. అనుకున్న మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో అంతా అనుకూలంగా ఉంటుంది. మొహమాటం లేకుండా మాట్లాడండి.
ధనుస్సు
శ్రద్ధగా చేసిన పనులు ఫలిస్తాయి. బంధువులతో, స్నేహితులతో బంధాలు పటిష్టం చేసుకోండి. సమయానికి నిద్ర, ఆహారం తప్పనిసరి.
మకరం
అన్ని రంగాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయంతో పనులు పూర్తిచేయగలుగుతారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. తెలివితేటలతో ముఖ్యమైన పనులను చక్కబెట్టి అందరి ప్రశంసలు అందుకుంటారు.
మీనం
కొత్త మంచి పనులు మొదలుపెడతారు. కొన్ని విషయాల వల్ల మీ మనుషులు ఎవరో, కానవాళ్లు ఎవరో తెలుస్తుంది. లక్ష్య సాధనలో ఆత్మీయులు సహాయం చేస్తారు.
Also Read : పిల్లల చర్మం ఎంతో సున్నితం.. ఈ 3 వస్తువులు ఉంచండి వారికి దూరం!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.