వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గర్భిణులు వేసవిలో తప్పకుండా కీరా, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురికాదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాంతులు వస్తుంటాయి. దీంతో బాడీలోని వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి.

New Update
pregnancy4

Pregnancy

గర్భం దాల్చిన సమయంలో మహిళలు సీజన్‌తో సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వేసవి కాలం వచ్చేస్తుంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండేస్తున్నాయి. కొన్ని చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఇలాంటి సమయాల్లో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు

చలవ చేసే ఆహార పదార్థాలు..

సాధారణంగా వేసవిలో ఎవరికైనా కూడా దాహం వేస్తుంది. అయితే గర్భిణులకు ఇంకా ఎక్కువగా దాహం వేస్తుంది. దీంతో వారు డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. గర్భిణులు ఎక్కువగా వాటర్ తాగాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా బాడీకి చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి. కీర దోస, జ్యూస్‌లు ఎక్కువగా తాగాలి. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం వేళలో ఒక అరగంట పాటు నెమ్మదిగా వాకింగ్ చేయాలి.

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువగా అవుతుంటాయి. దీంతో బాడీలోని వాటర్ ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి తాజా పండ్ల రసాలు, వాటర్, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. అలాగే సరైన సమయానికి భోజనం చేసి మందులు వేసుకోండి. బయట ఫుడ్ తినవద్దు. వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది. 

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు