ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు

ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే  నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది.

New Update
ap inter

ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్‌ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్  22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది.

 ఏప్రిల్‌ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు.  ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షల పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది. తొలి 23  రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌ పూర్తిచేసి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.  ఇంటర్ విద్యలో సాధ్యాసాధ్యాలు, అమలు చేయాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ మార్పులకు శ్రీకారం చుట్టాయి.  

Also read :   వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..పీఏ కృష్ణారెడ్డికి షాక్

ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ 

ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.  2025 మార్చి 1వ తేదీ నుంచి  19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెంకడియర్ పరీక్షలు జరగనున్నాయి.  ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ ద్వారా కూడా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా AP Inter Hall Ticket డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

Also Read :  AP Group 2 Exam: గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. Appsc సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు