వేసవిలో చల్లదనం కోసం వీటిని తీసుకున్నారో.. మీ ప్రాణాలు ఇక పైకే

చల్లదనం కోసం వేసవిలో ఎక్కువగా ఐస్ క్రీం, స్నో బాల్స్, ఫ్రిడ్జ్ వాటర్, శీతల పానీయాలు తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Summer

Summer Photograph: (Summer)

వేసవి కాలం ప్రారంభం కావడంతో చాలా మంది చల్లదనం కోసం కొన్ని పదార్థాలు తింటుంటారు. మండుటెండలో చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల హాయిగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత జీర్ణ సమస్యలు, గొంతు సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసవిలో చల్లదనం కోసం ఎక్కువగా తీసుకోకూడని ఆ పదార్థాలేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి:Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

శీతల పానీయాలు

వేసవిలో ఎక్కువగా శీతల పానీయాలు వైపు మొగ్గు చూపుతుంటారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే న్యూమోనియా, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇది కూడా చూడండి:Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

ఫ్రిడ్జ్ వాటర్

చల్లదనం కోసం వేసవిలో ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్ తీసుకుంటారు. వీటివల్ల బాడీ తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల ఫైబ్రాయడ్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

స్నో బాల్స్

వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, జలుబు, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వీటిని తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

ఐస్ క్రీమ్స్

చల్లగా ఉండే ఐస్‌క్రీమ్స్‌ను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటే గొంతు సమస్యలు, దగ్గు, కఫం వంటి సమస్యలు వస్తాయి. దీనికి తోడు మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వీటిలో ఎక్కువగా చక్కెర వాడుతారు. కాబట్టి ఎక్కువగా వీటిని తీసుకోకపోవడం మంచిది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.RTVదీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

Advertisment
తాజా కథనాలు