Sri Rama Navami: నవమి నాడు రాముడిని ఏ టైంలో పూజించాలో తెలుసా?

ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 నిమిషాల్లోగా రాముడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Telangana : భద్రాచలం రాములోరి కల్యాణ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు..

Sri rama Navami

హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఓ ప్రత్యేకత ఉంది. రాముడిని భక్తితో పూజించే చాలా మంది ఈ పండును జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో నవమి రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఈ పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు నవమి రోజున జన్మించాడని అందుకే శ్రీరామ నవమిని నిర్వహిస్తారని చెప్పుకుంటారు.

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

నవమి రోజు ఇలా పూజిస్తే..

నవమి రోజున రాముడిని భక్తితో పూజిస్తే.. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. అయితే నవమి తిథి ఉన్న సమయంలోనే రాముడిని పూజిస్తేనే ఫలితం ఉంటుంది. మరి నవమి రోజున రాముడిని పూజించడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో పూజిస్తేనే మంచిదో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22 గంటల వరకు ఉంటుంది. అయితే సంప్రదాయాల ప్రకారం ఈ తిథి సమయంలోనే రాముడిని పూజించాలి. అయితే రాముడిని పూజించడానికి సరైన సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.35 గంటల వరకు మాత్రమే.

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

ఈ సమయంలో వీలు కాని వారు నవమి తిథి ఉన్న సమయంలో పూజ చేసుకోవచ్చు. ఈ టైంలో రాముడిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీ రామ చరిత మానస్ కూడా చదివితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ విషయాలపై సందేహాలు ఏవైనా ఉంటే మీ సమీపంలోని పండితులను సంప్రదించగలరు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు