/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/RAM-jpg.webp)
Sri rama Navami
ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే నవమి రోజు వేకువ జామునే నిద్ర లేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై ఓ పీటను అమర్చి.. పట్టు వస్త్రం లేదా కొత్త దుస్తులు సమర్పించాలి. అలాగే రాముడికి ఇష్టమైన వంటలు అన్ని కూడా చేసి పెట్టాలి. అప్పుడే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి.
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
వీటినే నైవేద్యంగా నవమి రోజు పెడితే..
శ్రీరాముడికి ఎక్కువగా కార్న్ క్యాబేజీ వడలు, రవ్వ అప్పాలు, కోసంబరి, పానకం, వడపప్పు, పండ్లు పెట్టాలని పండితులు చెబుతున్నారు. వీటిని నైవేద్యంగా సమర్పించి భక్తితో పూజ చేస్తే.. నెల రోజుల్లోనే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
ఇవే కాకుండా వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరడంతో పాటు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ విషయాలపై సందేహాలు ఏవైనా ఉంటే మీ సమీపంలోని పండితులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు