/rtv/media/media_files/2025/08/15/sri-krishna-janmashtami-2025-2025-08-15-12-26-42.jpg)
Sri Krishna Janmashtami 2025
ప్రతీ ఏడాది కృష్ణాష్టమి పండుగ(Sri Krishna Janmashtami 2025) ను ఎంతో ఘనంగా భక్తులు జరుపుకుంటారు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణాష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 09:34 గంటలకు ముగుస్తుంది. అష్టమి తిథి 16వ తేదీన ఉండటంతో శనివారం రోజున ఉదయం ఈ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఏ తిథి అయినా, పండుగ అయినా అన్ని రాశుల వారికి ఒకే రకమైన ఫలితాలను ఇవ్వదు. కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండవచ్చు. అయితే కృష్ణాష్టమి వల్ల కొన్ని రాశుల(zodiac-signs) వారికి చెడు జరగనుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: రాఖీ కడుతున్నారా.. హారతి పళ్లెంలో ఈ 10 తప్పనిసరి!
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి కృష్ణాష్టమి రోజున కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో నష్టాలు రావచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే కృష్ణుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశి వారికి కృష్ణాష్టమి రోజున అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలపై చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపారాల్లో పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రతీ విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని పండితులు అంటున్నారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కృష్ణాష్టమి రోజున గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. దీనివల్ల కొన్ని పనులు పూర్తి కావు. ఏ పని చేపట్టినా ఆటంకం ఏర్పడుతుంది. ఏదైనా పని ప్రారంభించాలంటే చాలా సమయం పడుతుందని పండితులు అంటున్నారు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే చిన్న మాట పెద్ద వివాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
శ్రీకృష్ణుడిని పూజించడం
కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి, తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ధనుస్సు రాశి వారు "ఓం జగద్గురువే నమః" అని, మకర రాశి వారు "ఓం పూతనా-జీవిత హరాయ నమః" అని, కుంభ రాశి వారు "ఓం దయానిధాయ నమః" అని జపించడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి. అలాగే దానధర్మాలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవని పండితులు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి