Raksha Bandhan 2025: రాఖీ కడుతున్నారా.. హారతి పళ్లెంలో ఈ 10 తప్పనిసరి!

రాఖీ పళ్లెంలో రాఖీతో పాటు కలశం, కొబ్బరి, తమలపాకు, రోలి, గంధం, అక్షతం, పెరుగు, రాఖీ, స్వీట్లు ప్లేట్‌లో ఉంచి నెయ్యి దీపం వెలిగించాలి. రాఖీ కట్టిన తర్వాత స్వీట్లు తినిపించాలి. అలాగే దీపంతో సోదరుడికి హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.

New Update
Raksha Bandhan 2025

Raksha Bandhan 2025

భారతీయులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. సోదరుడు, సోదరి మధ్య బంధాన్ని మెరుగుపరచడానికి ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఈ రాఖీ పండుగను నిర్వహిస్తారు. సోదరులు సోదరుడికి రాఖీ కట్టడం వల్ల వారికి భరోసాగా ఉండాలని, రక్షణ ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే సోదరులు సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని రాఖీ కట్టి ప్రార్థిస్తారు. దేశమంతా ఈ రక్షా బంధన్‌ను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే రాఖీ కట్టడానికి కొందరు హారతి పళ్లెంలో కొన్ని పెట్టరు. తెలిసో తెలియక పళ్లెంలో కొన్ని వస్తువులు పెట్టకపోవడం వల్ల దాని ఫలితం రాదని పండితులు అంటున్నారు. రాఖీ కట్టేవారు తప్పకుండా పళ్లెంలో కొన్ని వస్తువులు పెట్టాలని, అప్పుడే రాఖీ కట్టిన ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అయితే రాఖీ పళ్లెంలో మరి పెట్టాల్సిన వస్తువులు ఏంటనే చూద్దాం. 

ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా?

ఈ పది వస్తువులు ఉంటేనే..

రాఖీ కట్టే ముందు కొందరు పళ్లెంలో రాఖీ, కుంకుమ, స్వీట్లు పెడతారు. అయితే కేవలం ఇవే కాకుండా కొన్ని వస్తువులను పెట్టాలని పండితులు చెబుతున్నారు. పళ్లెంలో రాఖీతో పాటు కలశం, కొబ్బరి, తమలపాకు, రోలి, గంధం, అక్షతం, పెరుగు, రాఖీ, స్వీట్లు ప్లేట్‌లో ఉంచి నెయ్యి దీపం వెలిగించాలి. రాఖీ కట్టిన తర్వాత స్వీట్లు తినిపించాలి. అలాగే దీపంతో సోదరుడికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సోదరుడు ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. అయితే ఫ్రెష్ కాకుండా సోదరుడికి రాఖీ కట్టకూడదని పండితులు అంటున్నారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తర్వాత సూర్యుడికి నీళ్లు అర్పించి ఇంట్లో పూజలు చేయాలి. ఆ తర్వాత ప్లేట్‌లో ఇవన్ని వేసి, సోదరుడిని తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చో బెట్టాలి. ఆ తర్వాత తిలకం పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తేనే రాఖీ ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలి? 1 లేదా 2 అనేది తెలియకుండా రాఖీ కడితే అంతే సంగతులు

ఇదిలా ఉండగా చాలా మంది వేరే రంగులో ఉండే రాఖీలను కడుతుంటారు. అయితే ఎరుపు, పసుపు, తెలుపు రంగుల దారాల్లో ఉన్న రాఖీలను కట్టాలని పండితులు అంటున్నారు. ఈ రంగు దారం ఉన్న రాఖీలను కట్టడం వల్ల సోదరుడికి, సోదరురాలికి కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. వీరిద్దరి మధ్య బంధం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కొందరు కేవలం రాఖీ సమయాల్లో మాత్రమే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కనీసం పట్టించుకోరు. అయితే రూల్స్ పాటించి రాఖీ కట్టుకోవాలని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు