Skin Care Tips: అమేజింగ్ టిప్స్.. ఇలా చేస్తే దెబ్బకు ముఖం మెరిసిపోవాల్సిందే!

ఎండ వేడికి గురై చాలామంది చర్మంపై మొటిమలు, ముడతలతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వాళ్లు కలబంద జెల్‌ను రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే ప్రయోజనం పొందుతారు. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మొటిమలు, ముడతలు కంట్రోల్ అయి చర్మం మెరుస్తుంది.

New Update
skin care tips

skin care tips

వేసవికాలంలో ముఖాన్ని ప్రకాశవంతంగా, సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎండ వేడికి ముఖంపై చాలా మార్పులు వస్తాయి. ముఖం పై మొటిమలు, నల్లటి మచ్చలు ప్రజల్ని ఎంతగానో చికాకు తెప్పిస్తాయి. అందువల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో నైట్ క్రీమ్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంది.. మృదువుగా చేస్తుంది. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

అయితే మార్కెట్లో వివిధ బ్రాండ్ల నైట్ క్రీమ్‌లు ఉన్నాయి. కానీ ఈ నైట్ క్రీమ్‌లలో అనేక కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మరింత హాని కలిగిస్తాయి. అలాంటి సమయంలో మరో సురక్షితమైన ఎంపిక కలబంద జెల్. ఇది చాలా సహజమైనది. చర్మంపై ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదు. అంతేకాకుండా దీనిని వేసవి కాలంలో ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సీజన్‌లో నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట కలబందను చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

 హైడ్రేటెడ్ స్కిన్

నిద్రపోయే ముందు కలబంద జెల్ అప్లై చేయడం వల్ల చర్మానికి హైడ్రేషన్ లభిస్తుంది. ఇది వేసవిలో చర్మాన్ని తేమగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనివల్ల మరుసటి రోజు చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

మృదువైన చర్మం

అలోవెరా జెల్ చర్మాన్ని సాఫ్ట్‌గా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల అది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

మెరిసే చర్మం

వేసవిలో ఎండవేడికి చర్మం నీరసించిపోతుంది. దీని కారణంగా నల్లటి మచ్చలు, టానింగ్ కూడా రావడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యలు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. అలాంటి సమయంలో నిద్రపోయే ముందు కలబంద జెల్‌ను అప్లై చేయడం ద్వారా.. కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

మొటిమలు, ముడతలు కంట్రోల్

వేసవికాలంలో చర్మంలో చెమట, నూనె పెరగడం వల్ల మొటిమలు, ముడతలు రావడం ప్రారంభమవుతాయి. ఈ సమస్యలకు కలబంద జెల్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మంలోని బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు దీనిని తక్కువగా వాడాలి. దీనిని అప్లై చేసేమందు సమీప వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

Skin Care Tips for winter | skin care tips in telugu | skin-care-tips | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు